13-09-2025 03:05:08 AM
- గ్రూప్-1 పరీక్షపై కోర్టుకు సరైన ప్రొజెక్షన్ ఇవ్వలేకపోయినం
- అయినా న్యాయపరమైన అంశాలను అధిగమిస్తం
- నిరుద్యోగులు ఆందోళన చెందొద్దు
- మంత్రి పొన్నం ప్రభాకర్
హుస్నాబాద్, సెప్టెంబరు 12 : తెలంగాణలో ఉద్యోగ నియామకాలకు సంబంధించి హైకోర్టు నిర్ణయాలపై బీజేపీ, బీఆర్‌ఎస్లు రా క్షసానందం పొందుతున్నాయని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రంగా విమర్శించారు. ఉద్యోగాల భర్తీలో పారదర్శకతను పాటిస్తున్నామని, నిరుద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేద ని భరోసా ఇచ్చారు.
శుక్రవారం ఆయన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్, అక్కన్నపేట మండ లాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం, హుస్నాబాద్ బార్ అసోసియేషన్ వార్షికోత్సవంలో చీఫ్ గెస్టు గా హాజరై మాట్లాడారు. గ్రూప్-1 పరీక్ష నిర్వహణలో గత ప్రభుత్వం తీసుకున్న అనేక నిర్ణయాలు వివాదాస్పదంగా మారాయన్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు 65 వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేశామని తెలిపారు. గ్రూప్-1 పరీక్షల నిర్వహణలో లోపాలు ఉన్నాయని కొందరు కోర్టు కు వెళ్తే, న్యాయస్థానంలో తాము సరైన వాదనలు వినిపించలేకపోయామని మంత్రి అంగీకరించారు. పరీక్షలు సక్రమంగానే జరిగాయి. కానీ కోర్టులో ప్రొజెక్షన్ ఇచ్చే సమ యంలో ఎక్కడో లోపం జరిగింది. కోర్టు సమీక్షించి ఒక నిర్ణయం తీసుకుంది. ఆ తీర్పు ను అందరూ గౌరవించాలి. అయితే ఈ నిర్ణయంపై బీజేపీ, బీఆర్‌ఎస్లు రాక్షసానందం పొందడం దురదృష్టకరం అని మం త్రి అన్నారు. న్యాయస్థానం నిర్ణయాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతిపక్షాలు రాజకీయ ల బ్ధి పొందాలని చూస్తున్నాయని మండిపడ్డారు.
అన్ని నియామక ప్రక్రియలను ఎక్క డా ఇబ్బందులు లేకుండా, అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. ‘న్యాయపరమైన అంశాలను అధిగమించి ముందుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాం‘ అని అన్నారు. నిరుద్యోగ యువత ఎలాంటి ఆం దోళన చెందవద్దని మంత్రి సూచించారు.
త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని, ఎక్కడ ఖాళీలు ఉన్నాయో వివరాలు సేకరించి నోటిఫికేషన్లు జారీ చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. నిరుద్యోగులందరూ పరీక్షలకు ప్రిపేర్ కావాలన్నారు. ప్రతిపక్షాలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, నిరుద్యోగుల పక్షాన నిలబడి సలహాలు, సూచనలు ఇవ్వాలని హితవు పలికారు.
హుస్నాబాద్ పరిధిలో బార్ అసోసియేషన్, కొత్త కోర్టు భవనాల కోసం ఐదు ఎక రాల స్థలం, సబ్ కోర్టు, నవోదయ పాఠశాల, బాసర ట్రిపుల్ ఐటీ బ్రాంచ్, 50 సీట్లతో పీజీ మెడికల్ కాలేజీ, టూరిజం ప్రాజెక్టు తదితర ప్రాజెక్టులు అమలులోకి వస్తున్నాయని తెలిపారు. ఎల్లమ్మ చెరువు అభివృద్ధి, ఇంజినీరింగ్ కాలేజీ స్థల కేటాయింపు వంటి పనులు కొనసాగుతున్నాయని వివరించా రు. గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేయడం ద్వారా లక్షలాది మంది రైతులకు నీరు అందుతుంది. భూములు కోల్పోయే వారికి ప్రభు త్వం ఆర్థిక సహాయం అందిస్తుంది. ప్రజల సమస్యలు నేరుగా నా దృష్టికి తీసుకురావచ్చు. వాటి పరిష్కారం కోసం కృషి చేస్తా నుఅనిఅన్నారు.