ప్రభుత్వ పాఠశాలల్లో విప్లవాత్మక మార్పులు
ప్రభుత్వ పాఠశాలలను ఆదర్శంగా తీర్చిదిద్దాలి
జూన్ 10నాటికి పనులు పూర్తి చేయాలి : కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
హైదరాబాద్ సిటీబ్యూరో, మే 31 (విజయక్రాంతి) : హైదరాబాద్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చేందుకు ప్రభుత్వ పాఠశాలలను ఆదర్శంగా తీర్చిదిద్దాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు. పాఠశాలల్లో చేపట్టిన అభివృద్ధి పనులను జూన్ 10నాటికి పనులు పూర్తి చేయాలని చెప్పా రు. శుక్రవారం ఆలియాలోని అమ్మ ఆదర్శపాఠశాలలో జరుగుతున్న పనులను డీఈవో రోహిణితో కలిసి కలెక్టర్ అనుదీప్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డతూ జూన్ 4నాటికి బుక్స్ పంపిణీకి సిద్ధం చేయాలని సూచించారు. పాఠశాలలను పరిశుభ్రంగా ఉంచాలని, ఆహ్లాదకరమైన వాతా వరణాన్ని కల్పించాలని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో మంచి ఆట స్థలాలు, క్వాలిఫై టీచర్స్ ఉన్నారని చెప్పారు.






