6 August, 2026 | 2:30 AM

ప్రభుత్వ నర్సింగ్ కళాశాల ఆధ్వర్యంలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు

06-08-2026 12:00 AM

బాన్సువాడ, ఆగస్టు 5 (విజయ క్రాంతి):  కామారెడ్డి జిల్లా బాన్సువాడలోని ప్రభుత్వ నర్సింగ్ కళాశాలకు చెందిన బి.ఎస్.సి నర్సింగ్ 6వ సెమిస్టర్ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాల కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఆగస్టు 1 నుండి ఆగస్టు 7 వరకు ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను పాటిస్తారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) మరియు UNICEFతో కలిసి వరల్ అలయన్స్ ఫర్ బ్రెస్ట్ఫీడింగ్ యాక్షన్ (WABA) సమన్వయంతో, 2026 థీమ్ జీవితంలో స్థిరమైన ప్రారంభం కోసం తల్లిపాలను బలోపేతం చేయడం ఏమి పనిచేస్తుంది.

విద్యార్థులు థీమ్ ఆధారిత చార్ట్లు నినాదాల ద్వారా విద్యను కూడా అందించినారు. పుట్టిన గంటలోపే తల్లిపాలు - బిడ్డకు ప్రాణాన్నిచ్చే మొదటి అడుగు,తల్లిపాలు బిడ్డకు మొదటి టీకా - ఆరోగ్యానికి బలమైన పునాది,ఆరు నెలల వరకు కేవలం తల్లిపాలే - వేరే ఆహారం అసేవసరం లేనే లేదు, పుట్టిన గంటలోపు మురుగు పాలు  బిడ్డకు సంపూర్ణ రక్షణ కవచం,తల్లీ పాల ఉపయోగాలను,నర్సింగ్ తల్లుల కోసం అవగాహన పెంచడానికి సంఘం,కార్యాలయ మద్దతు యొక్క బలమైన నెట్వర్క్ను నిర్మించడం.

చివరగా జాతీయ గీతాలాపనతో కార్యక్రమం ముగించారు. ఎం.సి.హెచ్ ఏరియా హాస్పిటల్ ఆర్.ఎం.ఓ-I డా. సుజాత మేడమ్.,ఎం.సి.హెచ్ ఏరియా హాస్పిటల్ ఆర్.ఎం.ఓ-II , డా. ప్రకాష్,బాన్సువాడ ప్రభుత్వ నర్సింగ్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్చార్జ్-ప్రిన్సిపాల్ శ్రీమతి అన్నీ ప్రనూతి,ఎం.సి.హెచ్ పీడియాట్రిషియన్ డా. రతన్ సర్,ఎం.సి.హెచ్ ప్రసూతి గైనకాలజిస్ట్ డా. శ్రీలత సీనియర్ నర్సింగ్ ఆఫీసర్ అమృత,

లీలావతి, 1వ 4వ సంవత్సరం విభాగాల అసిస్టెంట్ ప్రొఫెసర్, హెచ్‌ఓడి, స్వర్ణలత, 2వ సంవత్సరం విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ హెచ్‌ఓడి శ్రీలత, 3వ సంవత్సరం విభాగం లెక్చరర్ క్లాస్ కో-ఆర్డినేటర్ సువర్ణ, 3వ సంవత్సరం విభాగం లెక్చరర్ ధనలక్ష్మి, 3వ సంవత్సరం విభాగం లెక్చరర్, మహేశ్వరి,నిర్మల, బాన్సువాడ ప్రభుత్వ నర్సింగ్ కళాశాల 1వ సంవత్సరం విభాగం,ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ లెక్చరర్లు, అధ్యాపకులు, విద్యార్థులు పరిపాలనా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.