24-04-2025 02:25:53 AM
ఉగ్రదాడిని ప్రపంచదేశాధినేతలు ఖండించారు.హేయమైన చర్యగా అభివర్ణించారు.
ఈ దారుణమైన నేరం సహించేదే లేదు. ఈ దాడికి కారకులైన వారిని తప్పకుండా శిక్షి స్తారని ఆశిస్తున్నా. మరణించిన వారి కుటుం బాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా.
పుతిన్, రష్యా అధ్యక్షుడు
ఇది హేయమైన చర్య. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి
ఆంటోనియో గుటెరస్, ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్
జమ్మూలో జరిగిన ఉగ్రదాడిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఇదో అమానవీయ చర్య. ఇటువంటి చర్యలు బాధాకరం. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాం.
జార్జియా మెలోని, ఇటలీ ప్రధాని
ఉగ్రదాడి అనాగరిక చర్య. ఉగ్రవాద నిర్మూలనకు ఇజ్రాయెల్ ఎప్పటికీ భారత్‌కు సహాయసహకారాలు అందిస్తుంది.
బెంజమిన్ నెతన్యాహూ, ఇజ్రాయెల్ ప్రధాని
పహల్గాం ఉగ్రదాడి దృశ్యాలు కలిచి వేస్తున్నాయి. ఉగ్రవాదుల నిర్మూలనలో మాల్దీవులు ఎప్పటికీ భారత్‌కు మద్దతుగా నిలుస్తుంది.
మొహమ్మద్ మయిజ్జు, మాల్దీవుల అధ్యక్షుడు
ఉగ్రదాడిలో అమాయకులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. బాధితుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం.
ఇమ్మాన్యుయేల్ మెక్రాన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు
పహల్గాం ఉగ్రదాడిని ఖండిస్తున్నాం. ఈ దాడిలో అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. బాధితుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాం. ఉగ్రవాదంపై పోరులో జర్మనీ ఎప్పుడూ భారత్‌కు సహాయంగా ఉంటుంది.
జర్మనీ విదేశాంగ కార్యాలయం
ఉగ్రచర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. దేశాల్లో అలజడులు రేపేందుకు జరిగే అన్ని రకాల ఉగ్రచర్యలను ఖండిస్తున్నాం.
యూఏఈ విదేశాంగ మంత్రిత్వశాఖ
ఈ దాడి దిగ్భ్రాంతికి గురి చేసింది. ఉగ్రదాడులకు చైనా వ్యతిరేకం. ఇదో అమానవీ య చర్య. బాధితులకు ప్రగాఢ సంతాపం తెలుపుతున్నాం.
చైనా రాయబారి జు ఫీహాంగ్
ఈ దారుణ ఉగ్రదాడిని ఖండిస్తున్నాం. ఈయూ (యురోపియన్ యూనియన్) ఎల్లప్పుడూ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుతూనే ఉంటుంది.
ఈయూ విదేశీ వ్యవహారాల ప్రతినిధి కాజా కల్లాస్