20-08-2025 01:09:35 AM
కన్నాయిగూడెం,ఆగస్టు19(విజయక్రాంతి)ములుగు జిల్లా కన్నాయిగూడెం మండల కేంద్రంలో ఫోటోగ్రాఫర్స్ ఆధ్వర్యంలో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని మంగళవారం ఘనంగా జరుపుకున్నారు. ప్రతి సంవత్సరం ఆగస్టు 19న ప్రపంచ వ్యాప్తంగా ఈ వేడుకలను జరుపుకుంటారు. ఈ సందర్భంగా మండల ఫోటో గ్రాఫర్స్ యూనియన్ నాయకులు మొదటి ఫోటో గ్రాఫర్ లూయిస్ డాగ్యురే చిత్రపటానికి పూలమాల వేసి అయన సేవలను స్మరించుకున్నారు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫోటోగ్రాఫర్లను ఏకం చేయడానికి మరింత మందిని ప్రోత్సహించే లక్ష్యంతో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం ప్రతి సంవత్సరం ప్రపంచ స్థాయిలో జరుపుకోవడం జరుగుతుందనీ అన్నారు. ఈ కార్యక్రమంలో మంచాల నర్సింహారావు,పూజరి సుధాకర్,వంగరి రాజశేఖర్,సుగ్గుల రాజు,శ్రీరాముల సందీప్,ఏలేశ్వరం జనార్ధన్ పాల్గొన్నారు.
మంగపేటలో..
మంగపేట, ఆగస్టు 19 (విజయ క్రాంతి ): ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించేందుకు ఆగస్టు 19న ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని జరుపుకుంటారు ఇందులో భాగంగా మంగపేట మండల ఫోటోగ్రాఫర్ల సంఘం ఆధ్వర్యంలో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ సంబరాలు జరుపుకున్నారు.ముందుగా ప్రముఖ ఫోటోగ్రఫీ పితామహుడు లూయిస్ డగరే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
నేటి డిజిటల్ యుగంలో ఫోటోగ్రఫీ రంగంపై ప్రస్తుత సమస్యలు, వాటి పరిష్కారాలు పలు అంశాలపై చర్చించుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల సీనియర్‌ఫోటోగ్రాఫర్లు వడ్లకొండ వీరయ్య, అక్కపెల్లి నరేష్, ఇప్పాల నరేష్ పూజారి శ్రీనివాస్ ,పల్లపు రమేష్ , వంగరి విశ్వనాథ్, కొడం రాజు, శివనేని మహేష్, ఉగ్గుమల్ల గణేష్, పిల్లలమర్రి కార్తీక్, మాటూరి సాయి, బండి రాకేష్, వంకాయల రాము, కోకిల రామ్మోహన్ పాల్గొన్నారు.