నాగిరెడ్డిపేటలో ఘనంగా ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవ వేడుకలు
నాగిరెడ్డిపేట్, ఆగస్టు 19 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండల కేంద్రంలో బుధవారం ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని మండల ఫోటో,వీడియో గ్రాఫర్లు ఘనంగా జరుపుకున్నారు.ఈ సందర్భంగా ఫొటోగ్రఫీ పితామహుడు లూయిస్- జాకాస్ మండే డాగురె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం మండల ఫొటో, వీడియో గ్రాఫర్స్,అధ్యక్షుడు షేక్ రియాజ్ ,తెలంగాణ ఫోటో, వీడియో గ్రాఫర్ సంక్షేమ సంఘం జెండాను ఆవిష్కరించారు. ఫొటోగ్రఫీ పితామహుడు లూయిస్ డాగురె ఫొటోగ్రఫీ అభివృద్ధికి ఆయన చేసిన కృషి,సేవలను కొనియాడారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు రియా జ్, ఉపాధ్యక్షులు నాగరాజు,సెక్రెటరీ వాజాహత్, క్యాషియర్ ఫరూక్,కుటుంబ భరోసా ఇంచార్జ్ నర్సాగౌడ్,మండల ఫోటో, వీడియో గ్రాఫర్, రమేష్,సాయిబాబా,రాజు, రాములు, దత్తు,కొండ రాజు, ఉమెర్,గణేష్ తదితరులు పాల్గొన్నారు.






