రైస్ మిల్లులో 40 కోట్ల ధాన్యం మాయం
- విజిలెన్స్ తనిఖీల్లో బయటపడ్డ అక్రమాలు
- పీఎస్‌లో డీఎం ఫిర్యాదు
నిర్మల్, ఆగస్టు 19 (విజయక్రాం తి): ఖానాపూర్ నియోజకవర్గానికి చెందిన ఓ ప్రజా ప్రతినిధి సమీప బ ంధువు రైస్ మిల్లులో 40 కోట్ల విలువచేసే ధాన్యం మాయమైనట్టు విజిలెన్స్ తనిఖీల్లో బహిర్గతమైనది. దీంతో అక్రమలపై నిర్మల్ సివిల్ సప్లయ్ డీఎం సుధాకర్ స్థానిక పోలీస్ స్టేషన్‌లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చే యడంతో కేసులు నమోదైనట్టు చెప్తున్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని సత్తనపల్లి ఏఆర్‌ఎస్ రైస్ మిల్లులో రూ.40.96 కోట్లు ప్రభుత్వ ధాన్యం కొరత ఉన్నట్లు విజిలెన్స్, పౌరసరఫరాల శాఖ అధికారు లు బుధవారం తనిఖీలు నిర్వహించారు.
వరిధాన్యం లెక్కల్లో రూ.40, 96,96,834 అంచనా వేశారు. ప్రభుత్వానికి అందించాల్సిన కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) కూడా భారీగా బకాయి ఉన్నట్లు ఫిర్యాదులో పేర్కొనగా ప్రభుత్వం అప్పగిం చిన వరి ధాన్యం లెక్కల్లో భారీ అవకతవకలు జరిగినట్లు ఈ వ్యవహా రంపై తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరా ల సంస్థ జిల్లా మేనేజర్ చుంచు సుధాకర్ ఎఆర్‌ఎస్(ఆజ్మీర రేఖా శ్యాం నాయక్) రైస్ మిల్ యజమానిపై ఖానాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఖానాపూర్ పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
మాజీ ఎమ్మెల్యేపై కేసు!
ఏఆర్‌ఎస్ రైస్ మిల్ నియోజకవర్గానికి చెందిన ఓ ప్రజాప్రతినిధికి చెందినదిగా ప్రచారం జరుగుతుంది. ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ సీనియర్ నేత రేఖా శ్యాంనాయక్‌పై స్థానిక పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైనట్లు సమాచారం.






