20-08-2025 01:00:07 AM
బాన్సువాడ ఆగస్టు 19 (విజయ క్రాంతి) : కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో బాన్సువాడ ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ అస్సోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఫోటో కెమెరా సృష్టికర్త లూయిస్ డాగురే చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. అదేవిధంగా బాన్సువాడ పట్టణ సీనియర్ ఫోటోగ్రఫీ దండు సంజీవరావు ను తన నివాసంలో పూలమాలవేసి శాలువతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమం లో అధ్యక్షులు గోవర్ధన్, ప్రధాన కార్యదర్శి శేఖర్, కోశాధికారి వెంకటేష్, గంగాధర్ యాదవ్, దత్తు, ఫయాజ్ మరియు యూనియన్ సభ్యులు పాల్గొన్నారు.
సదాశివనగర్‌లో..
సదాశివనగర్, ఆగస్ట్ 19(విజయక్రాంతి): ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ సందర్భంగా సదాశివనగర్ మండల ఫొటో గ్రాఫి యూనియన్ సభ్యులు మంగళవారం ఫోటోగ్రఫీ పితామ హుడు లూయిస్ డాగురె కి కొబ్బరికాయ కొట్టి పూలమాలయ వేసి వేడుకలు జరిపారు. మండల్ అధ్యక్షులు లడ్డు,ప్రధాన కార్యదర్శి రాజు, కోశాధికారి శ్రీకాంత్,మాజీ అధ్యక్షులు దీకొండ శ్రీధర్, సాయిబాబా, వేణు,శ్రీకాంత్ రెడ్డి, ప్రశాంత్,వంశీ,రవితేజ,సాయి పాల్గొన్నారు.