calender_icon.png 4 July, 2025 | 3:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అన్నంలో పురుగులు...

04-07-2025 01:32:25 AM

-ప్రశ్నిస్తే టీసీ ఇచ్చి పంపిస్తామని సిబ్బంది బెదిరింపులు..

బోథ్, జూలై 3 (విజయక్రాంతి): హాస్టల్లో విద్యార్థులు తినే అన్నం నాసిరకంగా ఉండడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదు ర్కొంటున్నారు. అన్నంలో పురుగులు వస్తే ఇదేమి ఫుడ్ అని ప్రశ్నిస్తున్న విద్యార్థులను టీసి ఇచ్చి ఇంటికి పంపిస్తామని సిబ్బంది బెదిరించిన ఘటన బోథ్ ఎస్టీ హాస్టల్ లో చోటుచేసుకుంది. విద్యార్థులకు ఇచ్చే మధ్యా హ్న భోజనంలో పురుగులు రావడంతో కలకలం రేగింది. పురుగులు వచ్చిన విషయంపై విద్యార్థులు  నిలదీయగా సంబంధిత హాస్టల్ ఇన్చార్జి విద్యార్థులను బెదిరించినట్లు  ఆరోపణలు వస్తున్నాయి.

ఈ విషయంపై ఏఐ ఎస్‌ఎఫ్ విద్యార్థి సంఘాల నాయకులు హాస్ట ల్ ను సందర్శించి విద్యార్థులను ఆరా తీయ గా పలు విషయాలు బయటకు వచ్చాయి. నీళ్లపప్పు, ఉడికి ఉడుకని అన్నం రోజు పెడుతున్నారని అదేమని ప్రశ్నిస్తే తింటే తిను లేక పోతే లేదు, లేదంటే టీసి ఇచ్చి పంపిస్తామని బెదిరిస్తున్నారని విద్యార్థులు వాపోయారు. ఈ వ్యవహారాన్ని ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ (AISF) బోథ్ యూనిట్ తీవ్రంగా ఖండిస్తోందన్నారు.

విద్యార్థిని బెదిరించిన హాస్టల్ ఇంచార్జ్‌పై కఠిన చర్యలు తీసుకోవా లి డిమాండ్ చేశారు. వర్షాకాలం సీజనల్ వ్యాధుల బారిన  పడ్డ పిల్లలకు కనీసం మెడిసిన్ సౌకర్యం కూడా లేకపోవడం బాధాకరం అన్నారు. వారంలోగా చర్యలు తీసుకోకపోతే ఏఐఎస్‌ఎఫ్ ఉద్యమాన్ని ఉధృతం చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బోథ్ ఏఐ ఎస్‌ఎఫ్  యూనిట్ మండల అధ్యక్షుడు ము న్సిఫ్,  నరేష్, శ్రీకాంత్, నితీష్ పాల్గొన్నారు.