04-07-2025 01:32:54 AM
మలక్‌పేట్, జూలై 3 (విజయ్ క్రాంతి): మలక్‌పేట్‌లోని నెక్ట్స్ గెలారియా షాపింగ్‌మాల్‌లో ఫైర్ స్టేషన్ సిబ్బంది మాక్‌డ్రిల్ నిర్వహించారు. మలక్‌పేట్, సాలార్జంగ్ మ్యూజియం ఫైర్ స్టేషన్ చెందిన అగ్నిమాపక వాహనాలు, సిబ్బంది పాల్గొని విపత్తు సమయంలో రెస్క్యూ నిర్వహించాల్సిన తీరును చేసి చూపించారు. అగ్ని ప్రమాదం, విపత్తు సంభవించినప్పుడు తీసుకోవాల్సిన చర్యలు జాగ్రత్తల గురించి జిల్లా డీఎఫ్‌ఓ వెంకన్న వివరించారు.
ప్రమాదాలు చోటు చేసుకున్నప్పుడు భయపడకుండా, సమయస్ఫూర్తితో వ్యవహరిస్తూ అక్కడి నుంచి బయటపడేందుకు మెట్ల మార్గం ద్వారా రావాలని తెలిపారు. అగ్నిమాపక పరికరాలపై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలని తెలియజేశారు. అగ్నిమాపక సిబ్బంది నిర్వహించిన మాడ్రిల్ పలువురిని ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో మలక్పేట స్టేషన్ హౌస్ ఆఫీసర్ షౌకత్ అలీ, కరామత్ బేగ్, షాపింగ్ మాల్ ఇన్చార్జ్ పంకజ్ తదితరులు ఉన్నారు.