calender_icon.png 4 July, 2025 | 6:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమస్యల పరిష్కారానికి చర్యలు

04-07-2025 01:31:43 AM

ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్

ముషీరాబాద్, జూలై 3 (విజయక్రాంతి): సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ఈ మేరకు గురువారం రాంనగర్ డివిజన్ దయరా మర్కెట్ రామాలయం వద్ద,   బాకారం పెండిగిర్నీ లైన్ తో పాటు పలు ప్రాంతాలలో స్థానిక బస్తి వాసులు ఎదుర్కొంటున్న పలు సమస్యలు డ్రైనేజీ,  మంచినీటి సమస్య,  రోడ్డు స్ట్రీట్ లైట్స్ తదితర సమస్యలపై ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ దృష్టికి తేవడంతో సంబంధిత అధికారులతో కలిసి  సందర్శించి స్థానిక ప్రజలను సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన దృష్టికి వచ్చిన పలు సమస్యలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని అధికారులను  ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షు లు టీ. శంకర్ ముదిరాజ్, కార్యదర్శి మన్నె దామోదర్ రెడ్డి,  బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు ముదిగొండ మురళి,  ముచ్చకుర్తి ప్రభాకర్,  జి. కాశినాథ్ యాదవ్,  బాబు గౌడ్, జ్ఞానేశ్వర్ గౌడ్, పి. విజయకృష్ణ, ఎస్. వెంకటేష్, శ్రీకాంత్ ముదిరాజ్, వెంకటేశ్వర్ రావు, సునీల్,  సుబ్రహ్మణ్యం జలమండలి అధికారి డీజీఎం మోహన్ రాజు, జిహెచ్‌ఎంసి డిఈ గీత  సిబ్బంది పాల్గొన్నారు.