12 April, 2026 | 12:34 PM

డబ్బులు సమానంగా పంచలేదని ఆందోళన

13-05-2024 01:08 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, మే 12 (విజయక్రాంతి) ః పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ఆదివారం రాత్రి ప్రలోభాలు జోరుగా సాగాయి. వివిధ పార్టీల నాయకులు రహస్యంగా ఓటర్లకు డబ్బులు పంచారు. అయితే, అన్ని ప్రాంతాల్లో ఓటర్లకు నగదు పంపిణీ రహస్యంగా చేపట్టగా, సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలో ప్రలోభాల పర్వం ఇందుకు భిన్నంగా సాగింది. అంబర్‌పేట తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా ఉన్న ఓ పార్టీ నాయకుడు అపార్ట్‌మెంట్‌లో ఉండే మహిళలకు పెద్ద ఎత్తున డబ్బులు పంపిణీ చేసినట్టు సమాచారం. అయితే, డబ్బులు కొందరికి ఎక్కువగా, మరికొందరికి తక్కువగా పంపిణీ చేయడంపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అందరికీ సమానంగా డబ్బులు ఇవ్వాలని స్థానికులు వివాదానికి దిగారు. రాజకీయ పార్టీ నాయకులు ఓటర్లకు బహిరంగంగానే డబ్బులు పంచుతున్నా పోలీసులు కానీ, ఎన్నికల అధికారులు కానీ అటు వైపు చూడకపో వడం గమనార్హం.