12 April, 2026 | 10:52 AM

పాతబస్తీలో పటిష్ఠ భద్రత

13-05-2024 01:10 AM

సమస్యాత్మక ప్రాంతాల్లో కట్టుదిట్టంగా బందోబస్తు

పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు

చార్మినార్, మే 12: హైదరాబాద్‌లోని పాతబస్తీలో పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు ఈసీ పక డ్బందీ చర్యలు చేపట్టింది. గతంలో పలు పోలింగ్ కేంద్రాల వద్ద ఇరువర్గాల మధ్య అల్లర్లకు దారితీసిన సందర్భాలు ఉన్నాయి. ఈ అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఎన్నికల అధికారులు పోలింగ్ కేంద్రాల వద్ద పక్కా ప్లాన్‌తో నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఇప్పటికే మూడు కమిషనరేట్ల పరిధిలో 26 వేల మంది పోలీసులు బందోబస్తులో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నారు. 60 కంపెనీల కేంద్ర బలగాలు నగరానికి చేరుకున్నాయి. దక్షిణ మండల డీసీపీ స్నేహమెహ్రాతోపాటు పలువురు ఏసీపీలు పరిస్థితులను గమనిస్తున్నారు. 

సీసీ కెమెరాల నిఘా వ్యవస్థ..

పోలింగ్ కేంద్రం లోపల ఓ సీసీ కెమెరా, పోలింగ్ కేంద్రం బయ ట మరో సీసీ కెమెరాను ఏర్పాటు చేసే విధంగా ఈసీ ఆదేశాలు జారీ చేసింది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో మంచి ఫలితాలను ఇవ్వడంతో ఈసారి కూడా రెండు సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. ఏదైనా సంఘటన జరిగినప్పుడు లేదా రిగ్గింగ్ అయినప్పుడు రికార్డు అయ్యే దృశ్యాల ఆధారంగా చర్యలు తీసుకునే వీలుగా ఈసీ కెమెరాల ఏర్పాటును చేపట్టింది.