05-09-2025 12:12:12 AM
బాన్సువాడ సెప్టెంబర్ 4 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని సాయి కృప నగర్ కాలనీలో గల గిరిజన బాలుర కళాశాల వసతి గృహం లో వినాయక చవితి పర్వదినం సందర్భంగా ఇవాళ మరి గురువారం ప్రతిష్టించిన వినాయకునికి ఘన పూజలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ రమేష్ ఆధ్వర్యంలో ప్రతిరోజు ఉదయం సాయంత్రం ప్రత్యేక పూజలు, సాయంత్రం సాంస్కృతి.
కార్యక్రమాలు అన్నదాన కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో అంగరంగ వైభవంగా నిర్వహించినట్లు వార్డెన్ తెలిపారు వసతి గృహంలో వినాయకుని ప్రతిష్టించి ప్రత్యేక పూజలు చేస్తామని ఆయన అన్నారు విద్యార్థులకు గణనాథుని ఆశీర్వాదాలు ఎల్లప్పుడు ఉండాలని విద్యార్థులు మంచి స్థానాల్లో స్థిరపడాలని కోరుకుంటున్నామని వినాయకుని ప్రార్థించామని అన్నారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.