calender_icon.png 11 September, 2025 | 5:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గురువులదే సమాజ నిర్మాణంలో కీలకపాత్ర

05-09-2025 12:12:06 AM

టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిల్ల శీను బాబు

మహాదేవపూర్, సెప్టెంబర్ 4 (విజయక్రాంతి): గురువులు సమాజా నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తారని, తమ జీవిత కాలాన్ని విద్యార్థుల భవిష్యత్తు కోసం అంకితం చేసి సమాజానికి వెలుగులను అందిస్తారని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిల్ల శీను బాబు అన్నారు.

గురువారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండల కేంద్రంలో గురుపూజోత్సవం సందర్భంగా మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో విశ్రాంత ఉద్యోగులు, గురువుల సన్మాన కార్యక్రమంలో ముఖ్య అతిధి గా పాల్గొన్న దుద్దిల్ల శీను బాబు మాట్లాడుతూ సమాజ నిర్మాణంలో గురువుల దే ప్రధాన పాత్ర అని కొనియాడారు.

ఈ గురు పూజోత్సవం లో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తాను  అని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ కోట రాజ బాబు, ప్రథమిక సహకార సంఘం చైర్మన్ చల్లా తిరుపతయ్య, విశ్రాంత ఉద్యోగులు అడప రాజయ్య, విక్రమ్ సింగ్, కాంగ్రెస్ యూత్ నాయకులు కటకం అశోక్, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

వడ్డేపల్లిలో..

వడ్డేపల్లి, సెప్టెంబర్ 4 (విజయ క్రాంతి): హనుమకొండ వడ్డేపల్లి లో పింగిళి ప్రభుత్వ మహిళా కళాశాల (స్వయం ప్రతిపత్తి) కళాశాల ప్రిన్సిపాల్ లెఫ్ట్ నెంట్ ప్రొఫెసర్ బి.చంద్ర మౌళి అధ్యక్షతన గురుపూజోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ సర్వేపల్లి రాధాకృష్ణ జన్మదినోత్సవాన్ని గురు పూజోత్సవంగా జరుపు కుంటున్నామని, ప్రపంచంలోని అన్ని వృత్తుల్లోకెల్లా అత్యుత్తమమైన వృత్తి ఉపాధ్యాయ వృత్తి అని అన్నారు.

కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డా. జి.సుహాసిని, ఐ క్యూ ఏ సి కో ఆర్డినేటర్ డా. డి.సురేష్ బాబు, అకాడమిక్ కోఆర్డినేటర్ డా. ఎం.అరుణ టీచర్స్ డే ప్రాధాన్యతపై ప్రసంగించారు. తదనంతరం కళాశాలలోని అధ్యాపకులను పుష్పగుచ్ఛం, శాలువలతో ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో అధ్యాప కులు పి.డి సుజాత, మధు, డా.సా రంగపాణి, డా. యుగంధర్, డా.సామ్యూల్ ప్రవీణ్ కుమార్, డా.కె. శ్రీనివాస్, డా. పి.పద్మ,కవిత, డా.రేణుక, డా.మాధవి, డా.లకన్ సింగ్, డా.ప్రశాంతి, జ్యోతి, ఉదయ శ్రీ, రాంరెడ్డి, రమేష్ వివిధ విభాగాల అధిపతులు, బోధన, బోధనేతర సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.