calender_icon.png 12 August, 2025 | 1:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రామాంజనేయ ఆలయంలో పూజలు

12-08-2025 01:20:34 AM

పట్టు వస్త్రాలు సమర్పించిన కాంగ్రెస్ నేత మురళీధర్‌రెడ్డి 

హైదరాబాద్ సిటీ బ్యూరో, ఆగస్టు 11 (విజయక్రాంతి): నాంపల్లిలోని సీతా రామాం జనేయ దేవాలయంలో శ్రావణమాసం పురస్కరించుకొని స్వామి వార్లకు సీనియర్ కాంగ్రెస్ నాయకుకు కే మురళీధర్‌రెడ్డి సోమవారం పట్టు వస్త్రాలు సమర్పించి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ  కుండపోత వర్షానికి హైదరాబాద్‌లోని లోతట్టు ప్రాంతాల్లో మురుగునీరు రోడ్లపై ప్రవహించింది,

మరోవైపు ఇంకా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెపుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, హైడ్రా కమిషనర్ రంగనాథ్‌తో కలిసి ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారని తెలిపారు. క్షేత్రస్థాయిలో పరిస్థితిని సమీక్షించిన సీఎం రేవంత్‌రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఆయనకు పేద ప్రజల ఆశీస్సులు, స్వామివారి ఆశీస్సులు ఎప్పటికీ ఉంటాయని మురళీధర్‌రెడ్డి తెలిపారు.