calender_icon.png 12 August, 2025 | 11:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గోల్కొండపై పంద్రాగస్టు సందడి

12-08-2025 01:21:38 AM

- స్వాతంత్య్ర వేడుకలకు పకడ్బందీగా ఏర్పాట్లు 

- రోడ్లు, భవనాల శాఖ ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్ 

హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 11 (విజయక్రాంతి): పంద్రాగస్టున గోల్కొండ కోటలో నిర్వహించే స్వాతంత్య్ర వేడుకలకు ఏర్పాట్లను వేగవంతంగా, పకడ్బందీగా పూర్తి చేయాలని రోడ్లు, భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్ అధికారులను ఆదేశించారు.

సోమవారం ఆయన జిల్లా కలెక్టర్ హరిచందన, అదనపు సీపీ విక్రమ్‌సింగ్ మాన్‌తో సహా పలువురు ఉన్న తాధికారులతో కలిసి గోల్కొండ కోటలో ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా వికాస్ రాజ్ మాట్లాడుతూ.. వర్షాల నేపథ్యంలో వేడుకలకు ఎలాంటి ఆటంకం కలగకుండా వాటర్‌ప్రూఫ్ షామియానాలు, జనరేటర్లు సిద్ధం చేయాలని సూచించారు. కాగా కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 161 అర్జీలు వచ్చాయి. వాటిని అదనపు కలెక్టర్ ముకుందరెడ్డి స్వీకరించారు.