వైభవంగా శ్రీ లలిత సహస్ర గలార్చన
ముకరంపుర,(విజయ క్రాంతి): కరీంనగర్ లోని స్థానిక వైశ్య భవన్ లో వైశాఖ పౌర్ణమి స్వాతీ నక్షత్రం శుక్రవారం పురస్కరించుకొని 1100 మందికి మాతలతోని అత్యంత వైభవంగా లలితాదేవి సహస్రనామార్చన పారాయణ కార్యక్రమం వైభవంగా జరిగింది. ప్రముఖ జ్యోతిష్య వాస్తు ఆగమ శాస్త పండితులు శ్రీమాన్ శ్రీ నమిలకొండ రమణాచార్య స్వామి వారి ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు సంకల్పం చేయించి, ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
లోక కల్యానార్థం, సకల సౌభాగ్య సిద్ధికై, ప్రజలలో ఈర్ష ద్వేషాలు తొలగి అన్యోన్యత అనురాగాలు పెరగాలని అందుకోసమని ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని నిర్వాహకులు తెలియపరచారు. ఈ కార్యక్రమంలో కే ఆర్ హాస్పిటల్ ఈషా ఈవెంట్ వారి నిర్వహణలో ఈ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ప్రముఖ పండితులు నమిలకొండ రమణాచార్యులు ప్రముఖ ఆధ్యాత్మిక సామాజికవేత్త గుండా రాధా కిషన్ ఆర్కే హాస్పిటల్ నిర్వాహకులు, బండారి రాజ్ కుమార్ ఈసా ఈవెంట్స్ నిర్వాహకురాలు కృష్ణప్రియ మొదలగు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పారాయణ కార్యక్రమం నిర్వహించే తీర్థప్రసాదాలు స్వీకరించారు. అమ్మవారి ప్రసాద తాంబూలాన్ని వచ్చిన భక్తులందరికీ నిర్వాహకులు అందజేశారు






