1 May, 2026 | 11:22 PM

గంజాయి రవాణా చేస్తున్న యువకుడు అరెస్ట్

01-05-2026 10:06 PM

చివ్వెంల,(విజయక్రాంతి): చివ్వెంల పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి రవాణా చేస్తున్న ఓ యువకుడిని పోలీసులు అరెస్ట్ చేసి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నమ్మదగిన సమాచారం మేరకు శుక్రవారం ఉదయం చివ్వెంల ఎస్‌ఐ వి.మహేశ్వర్ తన సిబ్బందితో కలిసి అక్రమ రవాణా, నేరాల నియంత్రణలో భాగంగా వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో ఉదయం సుమారు 7:40 గంటల సమయంలో విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారి (NH-65)పై అనుమానాస్పదంగా వెళ్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.

అతడిని తనిఖీ చేయగా కందుల శ్రావణ్ (22), తండ్రి మురళీధర్, మామిడాల గ్రామం, తిప్పర్తి మండలం, నల్గొండ జిల్లా వాసిగా గుర్తించారు. అతని వద్ద ఉన్న నల్లటి ప్లాస్టిక్ కవరును పరిశీలించగా అందులో నిషేధిత గంజాయి ప్యాకెట్ లభ్యమైంది. పోలీసులు గంజాయిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్‌కు తరలించారు. ఈ కేసు విచారణ సూర్యాపేట డీఎస్పీ వి. ప్రసన్నకుమార్ ఆధ్వర్యంలో కొనసాగుతోంది. కార్యక్రమంలో సూర్యాపేట రూరల్ సీఐ జి. రాజశేఖర్, చివ్వెంల ఎస్‌ఐ వి. మహేశ్వర్ మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.