1 April, 2026 | 1:34 PM

Breaking News

ఉద్యోగ నోటిఫికేషన్ల విడుదలకు.. ఏదో ఒక జీవో అడ్డంకి   •   దేశవ్యాప్తంగా అమల్లోకి కొత్త ఐటీ చట్టం.. రూ. 4 లక్షల వరకే పన్ను మినహాయింపు   •   దేవి హాస్పిటల్ వైద్యుల నిర్లక్ష్యం.. కడుపులోనే పసికందు మృతి   •   రాజేంద్రనగర్‌లో హైడ్రా భారీ ఆపరేషన్... రూ. 100 కోట్ల విలువైన స్థలం సేఫ్   •   ఎల్‌పీజీ కొరతపై ఆటో డ్రైవర్ల ఆందోళన... సాగర్ హైవేపై ట్రాఫిక్‌కు అంతరాయం   •   పౌల్ట్రీ కంపెనీల ధోరణిని నిరసిస్తూ చికెన్ షాపుల బంద్   •   గ్యాస్ కోసం క్షణక్షణం నిరీక్షణ   •   బాధిత కుటుంబాలకు హరీష్ రావు పరామర్శ   •   ఆకాశాన్నంటిన విమాన ఇంధనం ధరలు.. ప్రయాణికులపై ఛార్జీల మోత   •   యువనటిపై లైంగిక వేధింపులు.. ప్రముఖ దర్శకుడు అరెస్ట్   •  

తలపాగా చుట్టి.. ఎడ్ల బండి తోలి

06-05-2024 01:16 AM

ఆదిలాబాద్, మే 5 (విజయక్రాంతి) : ప్రతి ఓటరు తన ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆదివారం జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ రాజర్షి షా ఆదివారం వినూత్న ప్రచారం నిర్వహించారు. ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండల కేంద్రంలోని మార్కెట్ యార్డ్‌లో నిర్వహించిన చైతన్య సదస్సుకు ఆయన తలపాగా చుట్టి, ఎడ్లబండి తోలుతూ హాజరయ్యారు.  అనంతరం గ్రామస్తులతో ప్రతిజ్ఞ చేయించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఐదు సంవత్సరాలకోసారి ఎన్నికలు వస్తాయని, ఆ ఎన్నికలే ప్రజల తలరాతలు మారుస్తాయన్నారు. కార్యక్రమంలో డీవైఎస్వో వెంకటేశ్వర్లు, తహసీల్దార్ సత్యనారాయణ పాల్గొన్నారు.