calender_icon.png 24 February, 2026 | 1:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గచ్చిబౌలిలో గజం 1.76 లక్షలు

24-02-2026 12:00:00 AM

కూకట్ పల్లి బాలాజీనగర్‌లో రూ.1.64 లక్షలు

  1. హౌసింగ్ బోర్డు స్థలాలకు మరోసారి భారీ డిమాండ్
  2. బహిరంగ వేలం ద్వారా రూ 34.27 కోట్ల ఆదాయం

హైదరాబాద్, ఫిబ్రవరి 23 (విజయక్రాంతి): హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో హౌసింగ్ బోర్డు భూములకు మరోసారి అధిక ధరలు పలికాయి. గచ్చిబౌలిలో చదరపు గజానికి రూ.1.76 లక్షలకు, కూకట్‌పల్లి బాలాజీనగర్‌లో రూ.1.64 లక్షలకు కొనుగోలు చేశారు. గచ్చిబౌలి, బౌరం పేట్, బాలాజీనగర్, చింతల్ తదితర ప్రాం తాల్లోని మొత్తం 14 స్థలాలను బహిరంగ వే లం ద్వారా విక్రయించడానికి ఈ నెల 9న హౌసింగ్ బోర్డు నోటిఫికేషన్ విడుదలచేసిం ది. 

కేపీహెచ్‌బీ హోసింగ్ బోర్డు కమ్యూనిటీ హాల్‌లో సోమవారం నిర్వహించిన వేలం పాటలో సుమారు 50 మంది బిడ్డర్లు పా ల్గొన్నారు. విక్రయించిన వాటిలో బౌరంపేటతో పాటు బాచుపల్లిలో ఒక ప్లాట్ మిన హా మిగిలినవ్నీ ఎంఐజీ, హెఐజీ క్యాటగిరీలోని ప్లాట్లు కావడంతో వీటిని దక్కించు కోడానికి ప లువురు పోటీపడ్డారు. గచ్చిబౌలిలోని 263 చదరపు గజాల విస్తీర్ణంలోని ప్లాట్‌కు చదరపు గజం రూ.50 వేలు కనీస ధరగా నిర్దారించి వేలం నిర్వహించగా, చదరపు గజం రూ.1.76 లక్షల ధర పలికింది.

కూకట్‌పల్లి బాలాజీనగర్‌లోని 266 చదరపు గజాల విస్తీర్ణంలోని ప్లాట్‌ను వేలం పాటలో రూ.1.64 లక్షలు పలికింది. చింత ల్ ప్రాంతంలో ని ఓపెన్ ప్లాట్లకు కూడా మంచి డిమాండ్‌తో చదరపు గజం రూ.84 వేలు, రూ.74 వేలకు అమ్ముడు పోయినట్టు హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ వీపీ గౌతం తెలిపారు.

నిజాంపేటలోని సిద్ధి ప్లాట్‌కు కనీస ధర రూ.15 లక్షలుగా నిర్దారించగా దీనిని వేలం పాటలో రూ.17.70 లక్షలకు కొనుగోలు చేశారు. గచ్చిబౌలిలోని మరో ప్లాట్ చదరపు గజం రూ.లక్ష పలికింది. బౌరంపేట్‌లోని 2,600 చదరపు గజాల స్థలం చదరపు గజం రూ.61 వేలకు అమ్ముడుపోయింది. మొత్తంగా సోమవారం నాటి భూముల విక్రయాల ద్వారా రూ.34.27 కోట్ల మేర ఆదాయం వచ్చిందని వైస్ చైర్మన్ గౌతం వివరించారు.