24-02-2026 12:00:00 AM
కొమరవెల్లి, ఫిబ్రవరి 23: మోతాదుకు మించి రసాయన ఎరువులు, పురుగుల మందులు వాడొద్దని వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ రాధిక అన్నారు. మండలం పరిధిలోని అయినా పూర్ గ్రామంలో ఆత్మ కమిటీ ఆధ్వర్యంలో సేంద్రియ వ్యవసాయంపై రైతులకు అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మోతాదుకు మించి రసాయనక ఎరువులు వాడడం వల్ల రైతుకు పెట్టుబడి పెరగడంతోపాటు, పంటలకు తెగుళ్లు కూడా పెరుగుతాయి అన్నారు. అనంతరం ఆత్మ కమిటీ చైర్మన్ జక్కుల తిరుపతి మాట్లాడుతూ సేంద్రియ వ్యవసాయం వల్ల రైతులకు పెట్టుబడి తగ్గుతుందన్నారు.
పురుగు మందులు రసాయనక ఎరువులు వాడిన వినియోగించడం వల్ల ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారన్నారు. ప్రాచీన కాలం నాటి వరి వంగడాలైన చిట్టి ముత్యాలు కాలా నామాక్, ఎర్ర బియ్యం, బియ్యం లాంటివి పండించుకోవాలన్నారు. ఆత్మ కమిటీ ఆధ్వర్యంలో ఈ వంగడాలు ఉచితంగా అందజేస్తున్నామని తెలిపారు. జీవామృతం, పంచ గావ్య, కషాయాల తయారీ గురించి అవగాహన కల్పించారు. ఏవో కే వెంకట్ రావమ్మ, ఏఈఓ లు రవళి, భాస్కర్ రెడ్డి, రైతులు పాల్గొన్నారు.