వైసీపీ నేత నాగార్జున యాదవ్‌కు రిమాండ్
- 14 రోజులు విధించిన నాంపల్లి హైకోర్టు
- ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు..
హైదరాబాద్, జూలై 13(విజయక్రాంతి): వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(వైసీపీ) అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్‌కు సోమవారం నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఆయన్ని బేగంబజార్ పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఆయన్ని అరెస్ట్ చేసిన సమయంలో పోలీసులు సుప్రీంకోర్టు మార్గదర్శకాలు పాటించలేదని నాగార్జునయాదవ్ తరఫు న్యాయవాదులు వాదించారు. ఇటీవల ఓ టీవీ ఛానల్ డిబేట్‌లో నాగార్జున యాదవ్ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై అనుచి త వ్యాఖ్యలు చేశారు.
రేవంత్‌రెడ్డి ఒక స్విగ్గీ, జొమాటో డెలివరీ బాయ్ అంటూ.. దేశంలోనే అత్యంత దారుణంగా ఒక డెలివరీ బాయ్ ముఖ్యమంత్రి అయ్యాడంటూ వ్యాఖ్యానించా రు. అంతేకాదు రేవంత్‌రెడ్డికి ప్రభుత్వ జీవోలు కూడా చదవడం రాదంటూ వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించి పీసీసీ రాష్ట్ర కార్యదర్శి, న్యాయవాది కైలాశ్ సజ్జన్ చేసిన ఫిర్యాదు మేరకు ఈ నెల 10న బేగంబజార్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దీంతో ఆదివారం గుం టూరులోని నాగార్జున యాదవ్ నివాసానికి వెళ్లి ఆయన్ని అరెస్ట్ చేశారు.






