24 August, 2026 | 4:20 AM

పసుపు @ 18,639

22-05-2024 01:21 AM

సీజన్‌లో క్వింటాల్‌కు గరిష్ఠ ధర

సాగు తగ్గినా పెరిగిన లాభాలు

నిజామాబాద్ మార్కెట్లో 

52౧ కోట్ల లావాదేవీలు

నిజామాబాద్, మే 21 (విజయక్రాంతి ప్రతినిధి): చాలాకాలం తర్వాత పసుపు రైతుల ముఖాల్లో నవ్వు కనిపిస్తున్నది. ఈ ఏడు పసుపు పంటకు మంచి గిట్టుబాటు ధర దక్కడంతో అన్నదాత ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. చాలాకాలంగా క్వింటాల్‌కు రూ.౬౦౦౦ దాటని పసుపు.. ఈ ఏడాది గరిష్ఠంగా రూ.౧౮,౬౩౯కి అమ్ముడు పోయింది. కనిష్టంగా క్వింటాల్‌కు రూ.౮౦౦౦ ధర పలుకుతున్నది. సగటున క్వింటాల్‌కు రూ.౧౨,౦౦౦ ధర పలికింది. దీంతో నిజామాబాద్ మార్కెట్ యార్డులో కొనుగోళ్లు భారీగా పెరిగాయి.

ప్రస్తుత సీజన్‌లో యార్డులో దాదాపు రూ.52౧ కోట్ల విలువైన లావాదేవీలు నమోదయ్యాయి. కొంతకాలంగా క్వింటాల్ పసుపు రూ.౬ వేలు కూడా దాటకపోవంతో రైతులు సాగు విస్తీర్ణాన్ని తగ్గించారు. నిజామాబాద్ జిల్లాలో పసుపు సాగు విస్తీర్ణం సాధారణంగా ౪౦ వేల ఎకరాల వరకు ఉండగా, ఈసారి ౨౩ వేల ఎకరాల్లోనే సాగు చేశారు. దిగుబడి కూడా తగ్గింది. అయినా, మంచి ధర వస్తుండటంతో లాభాలు చూస్తున్నామని రైతులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు.

నిజామాబాద్ మార్కెట్‌లో పసుపు కొనుగోళ్లు ఇలా..

సంవత్సరం క్వింటాళ్లు

2018-19 10,75,226 

2019-20 10,78,821

2020-21 8,55,516

2021-22 8,38,932

2022-23 7,39,072

2023-24 4,16,682

ఈ ఏడాది నిజామాబాద్ మార్కెట్‌కు వచ్చిన

పసుపు పంట నెల క్వింటాళ్లు

ఫిబ్రవరి 1,50,000

మార్చి 1,64,00

ఏప్రిల్ 81,958

మే 20,000

మొత్తం 4,15,958