calender_icon.png 16 December, 2025 | 10:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎములాడకు ఆధ్యాత్మిక శోభ!

16-12-2025 01:21:34 AM

  1. అనుబంధ ఆలయాల్లో విద్యుత్ దీపాల వెలుగులు

భక్తులకు విస్తృత సౌకర్యాలు - ఈఓ : రమాదేవి

వేములవాడ, డిసెంబర్ 15 (విజయ క్రాంతి)సమ్మక్కసారలమ్మ జాతర సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా, వేములవాడ లోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం పరిసర ప్రాంతాలు ఆధ్యాత్మిక శోభతో వెలుగొందుతున్నాయి. దేవస్థానానికి అనుబం ధంగా ఉన్న ఆలయాలను రంగురంగుల విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా అ లంకరించారు.జాతర ప్రారంభం కావడంతో శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం, శ్రీ బద్ది పో చమ్మ అమ్మవారి ఆలయం, శ్రీ నగరేశ్వర స్వా మి ఆలయాలతో పాటు ఆలయ పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక విద్యుత్ దీపాల అ లంకరణ చేపట్టారు.

దీపాల వెలుగులతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణా న్ని సంతరించుకొని భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది.సమ్మక్కసారలమ్మ జాతర నే పథ్యంలో వేములవాడకు పెద్ద సంఖ్యలో తరలివచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం క లగకుండా దేవస్థాన అధికారులు విస్తృత ఏ ర్పాట్లు చేశారు. గుడి చెరువు పార్కింగ్ ప్రాం తంలో ప్రత్యేక లైటింగ్ ఏర్పాటు చేయడంతో పాటు, ఉచిత దర్శనం, రూ.100 కోడె కట్టె దర్శనం కోసం ప్రత్యేక క్యూలైన్లు సిద్ధం చేశారు.

వీఐపీ రోడ్తో పాటు ఆలయ పరిసర ప్రాంతాల్లో అవసరమైన అన్ని సౌకర్యాలు క ల్పించినట్లుఈఓ రమాదేవి తెలిపారు.అలాగే భక్తుల సౌకర్యార్థం స్నాన ఘాట్ల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. స్నానానికి వేడి నీరు (హాట్ వాటర్) సదుపాయం అందుబాటులో ఉంచినట్లు ఆలయ ఈఓ వెల్లడించా రు. స్నాన ఘాట్ల వద్ద స్పష్టమైన సూచిక బోర్డులు ఏర్పాటు చేసి, భక్తులు సులభంగా స్నాన ప్రాంతాలను గుర్తించేలా చర్యలు తీసుకున్నారు.

మార్గదర్శక సూచనలు కూడా ఏర్పాటు చేశారు.పరిశుభ్రత, నీటి సరఫరా, భద్రతా ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించినట్లు అధికారులు తెలిపారు. ఈ ఏర్పాట్లతో భక్తులు ప్రశాంత వాతావరణంలో స్వామివారి దర్శనం చేసుకునే అవకాశం కలుగు తుందని ఈఓ పేర్కొన్నారు.