calender_icon.png 16 December, 2025 | 2:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ అభ్యర్థి విమల విఠల్ రెడ్డిని గెలిపించండి: నాగేష్ శెట్కార్

16-12-2025 08:36:52 AM

సిర్గాపూర్,(విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండల పరిధిలోని కడ్పల్ గ్రామాన్ని జిల్లా ప్రణాళిక సంఘం మాజీ సభ్యుడు నాగేష్ శెట్కార్ సోమవారం కాంగ్రెస్ అభ్యర్థి మల్లగారి విమల విఠల్ రెడ్డి ప్రచారంలో పాలొన్నారు. ప్రచారంలో అయన మాట్లాడుతూ...మూడవ దశ గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల సందర్బంగా కడ్పల్ గ్రామ కాంగ్రెస్ పార్టీ  అభ్యర్థి మల్లగారి విమల విఠల్ రెడ్డి ఉంగరం గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఉమ్మడి మెదక్ జిల్లా ప్రణాళిక సంఘం మాజీ సభ్యుడు నాగేష్ శెట్కార్ ప్రజలకు పిలుపునిచ్చారు. గ్రామం అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని తెలిపారు. ప్రజల సమస్యలను పరిష్కరించే అభ్యర్థి విమల విఠల్ రెడ్డిని గెలిపిస్తే గ్రామం అన్ని రంగాల్లో ముందుకు సాగుతుందని అన్నారు. గ్రామస్థులు ఐక్యంగా ఉండి ఉంగరం గుర్తుకు గెలుపుంచాలని అయన కోరారు. గ్రామంలో నాగేష్ శెట్కార్ వెంట కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి విమల విఠల్ రెడ్డి వెంట ర్యాలీలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, యువకులు భారీ ఎత్తున పాల్గొని ర్యాలీ నిర్వహించారు.