calender_icon.png 16 December, 2025 | 2:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సోమార్​పేట్ సంఘటన దురదృష్టకరం

16-12-2025 08:35:17 AM

భాద్యులపై చట్టప్రకారం చర్యలు- ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు

ఎల్లారెడ్డి,(విజయక్రాంతి): సోమార్ పేట సంఘటన దురదృష్టకరమని, భాద్యులపై చట్టప్రకారం చర్యలుంటాయని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు,ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. ఈ మేరకు వీడియో సందేశం ద్వారా ఎమ్మెల్యే మాట్లాడుతూ…. ఎల్లారెడ్డి మండలం సోమార్పేట్ గ్రామంలో సోమవారం ఉదయం చోటుచేసుకున్న సంఘటన దురదృష్టకరమని, భాదాకరమని ఎమ్మెల్యే తన ఆవేదనను వ్యక్తం చేశారు. ఈ సంఘటన కి కారణమైన వారు ఎంతటివవారైన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. పోలీసులు విచారణ చేపట్టారని, తాను కూడా పోలీసులతో మాట్లాడటం జరిగిందని నిందితులను కఠినంగా శిక్షిస్తామని ఎమ్మెల్యే తెలిపారు.