30-07-2025 01:19:07 AM
హైదరాబాద్, జూలై 29 (విజయక్రాంతి): తనను బీజేపీ ఎమ్మెల్యే అని పిలవవచ్చని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పష్టం చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గతంలో తాను చేసిన వ్యాఖ్యలకు భిన్నంగా స్పందించారు. బీజేపీ తనకు సొంత ఇంటితో సమానమని, ఎప్పుడు పిలిచినా తిరిగి తన సొంత గూటికి వెళ్తానని పే ర్కొన్నారు.
కొందరు వ్యక్తుల తీరు నచ్చకే తాను పార్టీకి రాజీనామా చేశానని తెలిపారు. తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయలేదని అందుకే గోషామహల్‌లో తిరిగి ఉప ఎన్నిక జరగబోదని స్పష్టం చేశారు. తన రాజీనామాను కుట్ర చేసి వెంటనే ఆమోదింపచేశా రని ఆరోపించారు. అధిష్ఠానం తన రాజీనామా వ్యవహారంపై విచారణ జరుపుతుం దని ఆశించినా అలా జరగకుండా కొం దరు అడ్డుకున్నారని భావిస్తున్నట్లు తెలిపారు.
ఎప్పుడు పిలిచినా పార్టీలోకి వెళతా
అధిష్ఠానం ఎప్పుడు పిలిచినా పార్టీలోకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన స్పష్టం చేశారు. తాను కరుడుగట్టిన హిందుత్వ వాదినని, బీజేపీ మినహా ఏ పార్టీలోకి వెళ్లే ప్రసక్తే లేదని తెలిపారు. అయితే పార్టీకి నష్టం చేస్తు న్న వారి వివరాలు అధిష్ఠానానికి అం దించేందుకు ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నారు. కొత్త అధ్యక్షుడు రాంచందర్ రావు చక్కగా పార్టీని ముందుకు తీసుకుపోతుంటే ఆయన వెనక కూడా కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.
తనను పార్టీ పెద్దలు కచ్చితంగా తిరిగి పార్టీలోకి ఆహ్వానిస్తారనే పూర్తి నమ్మకం ఉందన్నారు. తెలంగాణ బీజేపీలో జరుగుతున్న అన్ని వ్యవహా రాలను పార్టీ పెద్దలకు చెప్పాకే తాను తిరిగి బీజేపీలోకి వస్తానని స్పష్టం చేశారు. అయితే ఇప్పటికీ పార్టీలో ఎంపీలు, ఎమ్మెల్యేలకు తగిన మర్యాద లేదనేది వాస్తవమని తెలిపారు. పార్టీకి రాజీనా మా చేసినా రాజాసింగ్... పార్టీకి దూరంగా ఉండేందుకు మాత్రం ఇష్టపడటం లేదని తాజా వ్యాఖ్యలతో తేలిపోయింది.