30-07-2025 01:17:51 AM
కల్యాణ మహోత్సవంలో కుటుంబ సమేతంగా పాల్గొన్న మంత్రి మల్లారెడ్డి
ఘట్ కేసర్, జూలై 29 : ఎదులాబాద్ లోని శ్రీగోదాసమేత శ్రీమన్నారు రంగనాయకస్వామి దేవాలయం ఆవరణలో సోమవారం రాత్రి శ్రీరంగనాయకస్వామి కళ్యాణ మహోత్సవం అత్యం త వైభవంగా కన్నులపండువగా జరిగింది. దేవాలయ బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆలయంలో ఉదయo గరుడ సేవ, గోదాదేవి తిరునక్షత్రం, పూజాకార్యక్రమాలు జరిగాయి. ఆలయ బ్రాహ్మనోత్తముల మంత్రోచ్ఛరణాల మధ్య జరిగిన స్వామి వారి కళ్యాణ మహోత్సవంతో మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి కుటుంబ సమేతంగా పాల్గొన్నారు.
స్థానిక మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు వారి కుటుంబ సభ్యులతో కలసి పాల్గొని కళ్యాణోత్సవం తిలకించి ప్రత్యేక పూజలు జరిపి మొక్కులు తీర్చుకున్నారు. స్వామి వారి కళ్యాణ మహోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో ఆలయ ఆవరణ, ప్రాంగణం కిటకిటలాడింది. భక్తులకు తీర్థప్రసాదాలను అందజేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
ఈమహోత్సవంలో ఘట్ కేసర్ ము న్సిపల్ కమీషనర్ రాజేష్, మాజీ సర్పంచ్ లు కాలేరు సురేష్, మాజీ సర్పంచ్ బట్టె శంకర్, కొం తం వెంకట్ రెడ్డి, ఓరుగంటి వెంకటేష్ గౌడ్, రైతు సొసైటీ డైరెక్టర్ చందుపట్ల ధర్మారెడ్డి, మాజీ ఎంపీటీసీలు కందుల కుమార్, మంకం రవి, బిఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షులు నాగులపల్లి ర మేష్, ప్రధాన కార్యదర్శి పొన్నాల కొండల్ రెడ్డి, మాజీ వార్డు సభ్యులు ఎరుకల దుర్గరాజు గౌడ్, ఆలయ ధర్మకర్తలు టి.పి. లక్ష్మణాచా ర్యులు, టి.పి. పురుషోత్తమాచార్యులు, శేషాచార్యులు, పార్థసారథి, వెంకటాచార్యులు, వేణుగోపాలచార్యులు, రఘునాథాచార్యులు, అనంత శేషాచార్యులు, రాజగోపాలచార్యులు వారి కుటుంబ సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.