30-07-2025 01:20:36 AM
*మాజీ హోం శాఖ మంత్రి మహమూద్ అలీ
తలకొండపల్లి,జులై 29: పట్టు పరిశ్రమను తెలంగాణ రాష్ట్రం అంతట వ్యాప్తి చెందేలా పట్టు పరిశ్రమ రైతులు కృషి చేయాలని తెలంగాణ రాష్ట్ర మాజీ హోం శాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు.తలకొండపల్లి మండలం కొరంత కుంట తాండాలో రైతులు సాగు చేస్తున్న మల్బరీ తో టలను మంగళవారం మాజీ హోం శాఖ మంత్రి మహమూద్ అలీ,మహి ఫౌండేషన్ ఛైర్మన్ డా క్టర్ జగదీష్ యాదవ్,ఎండి అరుణాసూర్యప్రకాష్,ఏడి నాగరత్న,సెరికల్చర్ జిల్లా అద్యక్షుడు శక్రునాయక్ లతో కలిసి క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా మహమూద్ అలీ మా ట్లాడుతు ఈ ప్రాంత రైతులు పట్టు పరిశ్రమ అభివృద్దికి కృషి చేయడం అభినందనియమన్నా రు.ఇక్కడ చేపడుతున్న మల్బరీ తోటల సాగు,షెడ్లు,వారు చేపడుతున్న యాక్టివిటిస్ అడిగి తెలుసుకున్నారు.రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు దృష్టి సారించడం గొప్ప మ లుపన్నారు.తన వ్యవసాయ పొలంలో పట్టుపరిశ్రమ అభివృద్దికి 10 ఎకరాల విస్తీర్ణంలో మల్బరీ తోటల సాగుకు సిద్దంగా ఉన్నట్లు మహమూద్ అలీ చెప్పారు.మహి ఫౌండేషన్ ద్వార మల్బరీ తోటల సాగుకు రైతులందరికి సహాయ సహాకారాలు అందించనున్నట్లు సంస్త ఎండి జగదీష్ యాదవ్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మల్బరీ తోటల సాగు రైతులుపాల్గొన్నారు.