13 July, 2026 | 9:36 PM

Breaking News

నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •   సర్ పత్రాల సేకరణను పరిశీలించిన మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్   •  

డిఫెన్స్ డ్రైవింగ్ చేయాలి

03-01-2026 12:00 AM

మోతే జనవరి 2 (విజయ క్రాంతి):- మండల పరిధిలోని రాఘవపురం ఎక్స్ రోడ్ గ్రామంలో జాతీయ రోడ్డు భద్రత మాస ఉత్సవాలలో భాగంగా శుక్రవారం ఎస్త్స్ర అజయ్ కుమార్ సిబ్బందితో కలిసి వాహన డ్రైవర్లకు రోడ్డు భద్రతా నియమాలపట్ల అవగాహన కల్పించారు. అనంతరం ఎస్త్స్ర అజయ్ కుమార్ మాట్లాడుతూ. రోడ్డు ప్రమాదాల నివారణ అనేది ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు.రోడ్డు ప్రమాదాల బారిన పడటం వల్ల మృత్యువాత పడి చాలా కుటుంబాలు రోడ్డున పడిన సందర్భాలు ఉన్నాయని వాహనాలు నడిపేటప్పుడు అత్యంత జాగ్రత్తగా డిఫెన్స్ గా డ్రైవింగ్ చేయాలని సూచించారు.

బైక్ పై వెళ్లేవాళ్లు హెల్మెట్ తప్పకుండా ధరించాలని, కారులో వెళ్లేవాళ్లు సీటు బెల్టు తప్పకుండా పెట్టుకోవాలని, ఆటో డ్రైవర్లు ఆటోలో ఎక్కువమంది ప్రయాణికులను ఎక్కించొద్దని అధిక వేగంతో వెళ్ళవద్దని సూచించారు. రోడ్డు భద్రత నియమాలు ప్రతి ఒక్కరికి తెలిసి ఉండాలని నిబంధనలను ఉల్లంఘించకూడదని హెచ్చరించారు. ప్రయాణ సమయంలో ప్రయాణికులను సురక్షితంగా గమ్యనికి చేర్చడం వాహన డ్రైవర్ బాధ్యత అని తెలిపారు.