calender_icon.png 3 January, 2026 | 12:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏకగ్రీవంగా ఉద్యోగ సంఘం ఎన్నికలు

03-01-2026 12:00:00 AM

ముకరంపుర, జనవరి 2 (విజయ క్రాంతి): జిల్లా టిసిఎన్జీవోస్ (కో-ఆపరేటివ్) ఉద్యోగుల సంఘం ఎన్నికలు శుక్రవారం టీఎన్జీవో భవనంలో ఏకగ్రీవంగా జరిగాయి. ఎన్నికల అధికారిగా టీఎన్జీవోల సంఘం కోశాధికారి ముప్పిడి కిరణ్ కుమార్ రెడ్డి వ్యవహరించారు. సంఘం అధ్యక్షులుగ సర్దార్ ప్రీత్ పాల్ సింగ్, కార్యదర్శిగా సల్వాజి తిరుమల్ రావు, సహాధ్యక్షులుగా రవికుమార్ లు ఎన్నికయ్యారు.

టీఎన్జీవోల సంఘం జిల్లా అధ్యక్షులు దారం శ్రీనివాస్ రెడ్డి, కేంద్ర సంఘం నాయకులు సర్దార్ హర్మీందర్ సింగ్, పట్టణ అధ్యక్షులు మారుపాక రాజేష్ భరద్వాజ్, గెజిటెడ్ అధికారుల నుంచి సంఘం నాయకులు జలాలొద్దీన్ అక్బర్ నూతన కార్యవర్గాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో కో-ఆపరేటివ్ డిపార్ట్మెంట్ నాయకులు మనోజ్, కావ్య, సాజిద్, రఫీకా, వనజ, రమ్య, తహసీన్, తదితరులు పాల్గొన్నారు.