calender_icon.png 5 January, 2026 | 7:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థికి జిల్లా ప్రథమ బహుమతి

03-01-2026 12:00:00 AM

మిర్యాలగూడ, జనవరి 2 (విజయక్రాంతి): గణిత శాస్త్రవేత్త శ్రీ శ్రీనివాస రామానుజన్ జయంతి ని పురస్కరించుకొని దశరథ మెమోరియల్ ఫౌండేషన్ సహకారంతో తెలంగాణ గణిత ఫోరం  జిల్లా స్థాయి గణిత ప్రతిభా పాఠవ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్ష లో మిర్యాలగూడ మండలం యాదగిరి పల్లి గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్దులు  జానపాటి శ్రీజ మొదటి బహుమతి గెలుచుకోగా  నక్క నవీన్ కుమార్ తృతీయ బహుమతి సాదించి రాష్ట్ర స్థాయి గణిత ప్రతిభా పాఠవ పరీక్ష కు ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు బాలు నాయక్ శుక్రవారం తెలిపారు.

గెలుపొందిన విద్యార్థుల కు మెమోంటూ లు ప్రశంస పత్రాలు నగదు బహుమతి అందుకున్న విద్యార్థులను  గ్రామ పెద్దలు, పాఠశాల ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు.  కార్యక్రమంలో  వెంకటయ్య, వెంకట మహేశ్వర్, విజయ,సైదా చారి, శ్రీశైలం, శేఖర్ రెడ్డి, జాకీర్ హుస్సేన్, ప్రశాంతి, రాము, పిడి బాల్తి వెంకటరత్నం  పాల్గొన్నారు.