4 August, 2026 | 1:02 PM

యువరైతు కరెంట్ షాక్ తో మృతి

04-08-2026 11:49 AM

మఠంపల్లి: మఠంపల్లి మండలం బక్కమంతుల గూడెం గ్రామానికి చెందిన యువరైతు నిమ్మల నరేష్ (29) మంగళవారం ఉదయం పొలం వద్ద కరెంట్ షాక్ తో మృతి చెందాడు.వర్షాల కారణంగా విద్యుత్ తీగ తెగి ఫెన్సింగ్ తీగపై పడిందని, దానిని తాకిన నరేష్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడని స్థానికులు తెలిపారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది.