చేర్యాల పెద్ద చెరువులో పడి వ్యక్తి మృతి
04-08-2026 11:46 AM
చేర్యాల: చేర్యాల పట్టణంలోని పెద్ద చెరువులో ఓ వ్యక్తి పడి మృతి చెందిన సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం చేర్యాల మండలం కొత్త దొమ్మాట గ్రామానికి చెందిన శెట్టే రామస్వామి (40) చెరువులో పడి మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీపించి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మృతుడికి భార్య, ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.






