30 March, 2026 | 9:52 AM

ఉరేసుకొని యువకుడు ఆత్మహత్య

17-06-2025 06:36 PM

టేకులపల్లి (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా(Bhadradri Kothagudem District) టేకులపల్లి మండలం దాసుతండ పంచాయతీ పరిధిలోని రేగులతండా గ్రామంలో ఓ యువకుడు మంగళవారం అనుమానస్థితిలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. రేగులతండాకు చెందిన బానోత్ లోకేష్(22) ఇంట్లో ఎవరు లేని సమయంలో ఫ్యాన్ కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.