ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య!
రైలు కిందపడి బలవన్మరణం
రాజేంద్రనగర్: ప్రేమ విఫలమై(Love Fails) ఓ యువకుడు రైలు కిందపడి ఆత్మహత్య(Commits Suicide)కు పాల్పడిన సంఘటన శంషాబాద్ పోలీస్ స్టేషన్(Shamshabad Police Station) పరిధిలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గొల్లపల్లి గ్రామానికి చెందిన మహేష్ (26) మంగళవారం రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
అతడి తండ్రి మల్లేష్ గత కొంతకాలంగా శంషాబాద్(Shamshabad)కి ఓ నాయకుడి వద్ద డ్రైవర్ గా పని చేస్తున్నాడు. ప్రేమ విఫలం కావడంతో రైల్వే ట్రాక్ పై మహేష్ సూసైడ్ చేసుకున్నాడని పోలీసులు భావిస్తున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న శంషాబాద్ పోలీసులు కాచిగూడ రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసిన కాచిగూడ రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.






