3 July, 2026 | 11:20 PM

Breaking News

బెల్లంపల్లి ఐటీడీఏ నర్సరీకి పూర్వవైభవం   •   పాఠ్యపుస్తకాలు అమ్ముతున్నారని విద్యార్థి సంఘాల ఆందోళన   •   ఉప సర్పంచ్ కవిత కుటుంబానికి అండగా ఉంటాం   •   చివ్వెంల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా దారావత్ వీరన్న నాయక్   •   డీఏపీ ఎరువుల ధరలు ఎమ్మార్పి ధరకు ఇవ్వాలి   •   ఎర్రుపాలెం శివాలయంలో శృంగేరి శారద పీఠాధిపతి ప్రత్యేక పూజలు   •   ఘనంగా ఇండియన్ క్రిస్టియన్ డే   •   ఇంటింటికీ ఎన్యుమరేషన్ ఫారమ్‌ల పంపిణీ కార్యక్రమాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఈఆర్‌వో శ్రీనివాస్ రెడ్డి   •   నివాళులర్పిస్తున్న జిల్లా అధ్యక్షుడు మెతుకు సత్యం   •   మహిళా సాధికారతే మోదీ లక్ష్యం   •  

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

09-09-2024 08:32 PM

రాజాపూర్,(విజయక్రాంతి): రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకుడు చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. కుటుంబ సభ్యులు, గ్రామస్తుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మండల కేంద్రానికి చెందిన అలీ ఈ నెల 3న తన మోటార్ సైకిల్ పై మహబూబ్నగర్ వెళుతున్న క్రమంలో ఏనుగొండ గ్రామ సమీపంలో డివైడర్ కు ఢీకొని తలకు శరీర భాగాలకు తీవ్ర గాయాలయ్యాయి. అక్కడి స్థానికులు చికిత్స నిమిత్తం అతడిని ఎస్వీఎస్ దవాఖానకు తరలించారు. అక్కడి వైద్యుల సూచన మేరకు హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రికి తరలించారు. అతడికి వైద్యులు గాయాలకు ఆపరేషన్ చేశారు. చికిత్స పొందుతూ సోమవారం మధ్యాహ్నం హఠాత్తుగా మృతి చెందాడు. అలీ గ్రామంలో మండలంలో పూల విక్రయించి మంచి సత్సంబాలుంధాలు కలిగి ఉండడంతో అతని మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు.