28 July, 2026 | 12:57 AM

శూరవీర్ కేజ్ వార్స్ ఛాంపియన్‌గా పట్నం చంద్రసేనా గౌడ్ ఘనవిజయం

28-07-2026 12:00 AM
  1. విద్యార్థులు క్రీడల్లో రాణిస్తూ రాష్ట్ర ప్రతిష్టను పెంపొందిచాలి
  2. మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్

ముషీరాబాద్, జూలై 27 (విజయక్రాం తి): విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లో రాణిస్తూ రాష్ట్ర ప్రతిష్టను పెంపొందించాలని మాజీ ఎంపీ, టీపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ ఎం. అంజన్ కుమార్ యాదవ్ సూచించా రు. సోమవారం ఐటీఏ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన శూరవీర్ కేజ్ వార్స్ టైటిల్ ఛాంపియన్ షిప్ పోటీలలో ముషీరాబాద్ కు చెందిన కాంగ్రెస్ పార్టీ బి-బ్లాక్ కమిటీ ఉపాధ్యక్షుడు పట్నం నాగభూషణం గౌడ్ కుమారుడు పి. చందసేనా గౌడ్ మిక్స్ డ్ మార్శల్ ఆరట్స్ (ఎంఎంఏ) టౌర్నమెంట్లో 56.7 కేజీల కేటగిరిలో శూరవీర్ కేజ్ వార్స్ ఛాంపియన్‌గా గోల్ మెడల్ టైటి ల్‌ను సాధించారు. ఈ సందర్భంగా ఆయనకు సర్టిఫికెట్, మెడల్ ఐటీఏ అకాడమీ వ్యవస్థాపకుడు మనీష్ కుమార్, ఈవెంట్ మేనేజర్ సంతోష్ కుమార్ అందజేశారు.

ఈ సందర్భంగా మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ ను మర్యాదపూర్వకంగా కలిసి సాధించిన టైటిల్ వివరాలను ఆయనకు వివరించారు. దేశంలోని వివిద రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు మిక్స్ డ్ మార్శల్ ఆరట్స్ టోర్నమెంట్ లో పాల్గొన్నప్పటికి ప్రతిభ కనబర్చి విజయం సాధించానని చంద్రసేన్ గౌడ్ తెలిపారు. ఆయనను అభినందిస్తూ అంజన్ కుమార్ యాదవ్ శాలు వాతో సత్కరించారు. అనంతరం మాట్లాడుతూ  ప్రభుత్వం క్రీడాకారులను ప్రోత్స హించేందుకు అన్ని విధాలా సహాయ సహాకారాలు అందిస్తున్నదని పేర్కొన్నారు. భవి ష్యత్ లో మరిన్ని మెడల్స్ సాధించాలని చంద్రసేన గౌడ్ ను అభినందించారు.