calender_icon.png 7 January, 2026 | 11:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మీది సర్వస్వాహా ప్రభుత్వం

05-01-2026 02:17:00 AM

ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆగ్రహం

హైదరాబాద్, జనవరి 4 (విజయక్రాంతి): అసెంబ్లీలో సీఎం రేవంత్ స్పీచ్‌కు కల్వకుంట్ల కుటుంబం అల్లాడిపోతోందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. ‘కేటీఆర్.. మీది సర్వస్వాహా ప్రభుత్వం. అందుకే మిమ్మల్ని తెలంగాణ ప్రజలు సాగనంపారు’ అని పేర్కొన్నారు. ఈ మేరకు ఆది వారం విప్ ఆది శ్రీనివాస్ ఒక ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ ఛాంపియన్స్‌గా చెప్పుకొని తిరుగుతున్న ఆ కుటుం బం అవినీతి చరిత్రను అసెంబ్లీలో ఎండగట్టడంతో ఆగమాగం అవుతున్నదని, కేటీఆర్‌కు అసహనం పీక్ స్టేజ్‌కి పోయిందని పేర్కొన్నారు.

పదేళ్ల బీఆర్‌ఎస్ తప్పు లను అసెంబ్లీ వేదికగా తూర్పార పట్టడంతో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు తల్లడిల్లిపోతున్నారని పేర్కొన్నారు. రాహుల్ గాంధీని ఉరితీయాలని పిచ్చి పట్టినట్లు మాట్లాడుతున్నారని ఆది శ్రీనివాస్ మండిపడ్డారు. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ కుమారుడిని ఉరితీయాలని కేటీఆర్ అనడం అంటే ఎంత నీలో ఎంత విషం ఉందో అర్థమవుతోందని ఆరోపించారు.

‘కేటీఆర్ తిన్నింటి చావును కోరుకుంటావా..? కేసీఆర్ చావును మా సీఎం రేవంత్‌రెడ్డి ఎప్పు డూ కోరుకోలేదు..? తెలంగాణ సంపదను దోచుకున్న వాళ్లను ఉరితీసినా తప్పులేదని మాత్రమే అన్నారు? ఆ తీవ్రతను చెప్పే ప్రయత్నం చేశారు తప్ప చావు గురించి మాట్లాడలేదు. ‘కేటీఆర్ నీ అసహనం తగ్గించుకో. మైండ్ కంట్రోల్ పెట్టుకో. లేకుంటే తెలంగాణ ప్రజలు నీకు మతి తప్పిందని భావించే అవకాశం ఉంది’ అని ఆది శ్రీనివాస్ హెచ్చరించారు.