calender_icon.png 8 January, 2026 | 9:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టెట్ రాసే టీచర్లకు ఓడీ!

05-01-2026 02:15:05 AM

ప్రభుత్వానికి ప్రతిపాదించిన విద్యాశాఖ

హైదరాబాద్, జనవరి 4 (విజయక్రాంతి): టెట్ (టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్) పరీక్షలు ఈనెల 3 నుంచే ప్రారంభమయ్యాయి. ఈ పరీక్షలకు మొత్తం 2,37,754 మంది దరఖాస్తు చేసుకోగా ఇందులో ఇన్ సర్వీస్ ఉపా ధ్యాయులు 71,670 మంది హజరవుతున్నారు. ఉద్యోగంలో కొనసాగేందుకు, పదో న్నతి పొందాలంటే టెట్ తప్పనిసరి చేస్తూ ఉద్యోగ విరమణకు ముందు ఐదేళ్లకు పైగా సర్వీసు మిగిలి ఉన్న టీచర్లు సర్వీసులో కొనసాగాలంటే టెట్ పాస్ కావాల్సిందేనని గతే డాది సెప్టెంబర్‌లో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిం ది.

దీంతోపాటు కచ్చితంగా విద్యాహక్కు చట్టం అమలు తేదీకి ముందు నియామకమైన ఉపాధ్యాయులు రెండేళ్లలో టెట్ అర్హత సాధించాలని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయులకు టెట్ రాయడం అనివార్యమైంది. ఈ నెల 3 నుంచి 20 వరకు 9 రోజులు పరీక్షలు జరగనున్నాయి. కొంత మందికి ఉన్న జిల్లాల్లో కాకుండా సుదూర ప్రాంతాల్లో పరీక్షా కేంద్రాలను కేటాయించారు.

పరీక్షకు హాజరయ్యే టీచర్లకు ఓడీ (ఆన్ డ్యూటీ) లేదా స్పెషల్ లీవ్ మంజూరు చేయాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు. ఉపా ధ్యాయ సంఘా ల విజ్ఞప్తుల నేపథ్యంలో ఓడీ లేదా స్పెషల్ లీవ్ ఇవ్వాలని ప్రభుత్వానికి పాఠశాల విద్యాశాఖ అధికారులు ఈనెల 2న లేఖ రాశారు. అయితే దీనిపై విద్యాశాఖ కార్యదర్శి ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని ఉపాధ్యాయ సంఘాల నేతలు చెప్తున్నారు. 

కచ్చితంగా ఇవ్వాల్సిందే..

టెట్ రాస్తున్న ప్రతి టీచర్‌కు ఓడీ ఇవ్వాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. పదోన్నతి కోసం డిపార్ట్‌మెంటల్ టెస్ట్ రాసేందుకు ఓడీ ఇస్తున్నప్పుడు.. ఉన్న ఉద్యోగం కాపాడుకోవడానికి ఓడీ లేదా స్పెషల్ లీవ్ ఎందుకివ్వరని ప్రశ్నిస్తున్నారు. ప్రతీ ఏడాది రెండు సార్లు టెట్ నోటిఫికేషన్‌ను ప్రభుత్వం జారీ చేస్తున్న నేపథ్యంలో సంవత్సరానికి రెండు సార్లు పరీక్షలకు హాజరయ్యేందుకు ఓడీ సౌకర్యం ఉపాధ్యాయులకు కల్పించాలని పలు ఉపాధ్యాయ సంఘాల నేతలు కోరుతున్నారు.