14-07-2025 12:29:23 AM
- మంత్రి వివేక్ వెంకటస్వామి
- ఎంపీ, ఎమ్మెల్యేలతో కలిసి అంబేద్కర్ విగ్రహావిష్కరణ
ఆదిలాబాద్, జూలై 13 (విజయ క్రాంతి): రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చూపిన మార్గంలోనే సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రజా ప్రభుత్వ పాలన కొనసాగుతోందని రాష్ట్ర మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండల కేంద్రంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహాన్ని ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యేలు అనిల్ జాదవ్, వెడ్మ బొజ్జు పటేల్‌లతో కలిసి మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ఘనంగా ఆవిష్కరించారు.
అదేవిధంగా బోనాల జాతర వేడుకకు సైతం మం త్రి హాజరయ్యారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ డాక్టర్ అంబేద్కర్ చూపిన మార్గంలోనే ప్రజా ప్రభుత్వం నడుస్తుందన్నారు. ప్రతి ఒక్కరికి సమాన హక్కులు, అవ కాశం అందే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్లే బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరుగుతోందని పేర్కొన్నారు. కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్ వడ్డీ పూజా రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు కంది శ్రీనివాస్ రెడ్డి, ఆడే గజేందర్, బోరంచు శ్రీకాంత్ రెడ్డి, గోక గణేష్ రెడ్డి గ్రామ ప్రజలు పాల్గొన్నారు.