30 May, 2026 | 11:54 PM

Breaking News

ఆర్టీసీ బస్సు ఢీకొని తీవ్ర గాయాలు ఆసుపత్రికి తరలింపు   •   ఖాతాదారుల సేవా కేంద్రం నిర్వహణకు దరఖాస్తుల ఆహ్వానం   •   గిరిజన యువతీ యువకులకు ఉచిత నైపుణ్యాభివృద్ధి శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం   •   మండల టాపర్‌ మేకా మాన్వితకు ట్రిపుల్ ఐటీ సీటు   •   పెద్దమల్లారెడ్డిలో అగ్నిప్రమాదం.. గడ్డివాము, ట్రాక్టర్ దగ్ధం   •   వరికొయ్యలు కాల్చవద్దు... బహిరంగ వ్యర్ధాలు కాల్చవద్దు   •   కూచిపూడి నృత్యంతో అలరించిన మోక్ష ధృతి   •   అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులను చేర్పించాలి: సీడీపీవో జ్యోతి   •   ఘట్కేసర్ లో ప్రారంభమైన సిపిఎం శిక్షణ తరగతులు   •   రైతు డిస్కమ్ రైతాంగానికి శాపం   •  

మద్యం మత్తులో యువకుల హల్‌చల్‌

05-04-2026 11:48 AM

హైదరాబాద్: మాదాపూర్ లో మద్యం మత్తులో యువకుల హల్‌చల్‌ చేశారు. ఆదివారం ఉదయం పటాన్ చెరు నుంచి కోఠికి వెళ్తున్న బర్కత్ పురా డిపో బస్సు కారుకు సైడ్ ఇవ్వలేదని ఆర్టీసీ బస్సు డ్రైవర్ మొయినుద్దీన్ పై దాడికి పాల్పడారు. మాదాపూర్ వద్ద ఓవర్ టేక్ చేసి బస్సుకు అడ్డంగా కారు నిలిపి డ్రైవర్ పై యువకులు దాడి చేసి బస్సు అద్దాలు రాళ్లో ధ్వంసం చేశారు. దాడి సమయంలో అటుగా వెళ్తున్న బైకర్ కు రాయి తగిలి తీవ్రగాయాలు కావడంతో దాడి తర్వాత ఇద్దరు యువకులు, యువతి కారులో పరారయ్యారు. మాదాపూర్ పీఎస్ లో  బస్సు డ్రైవర్ మొయినుద్దీన్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.