22 July, 2026 | 1:59 AM

మల్లాపూర్‌లో యువకుడు ఆత్మహత్య

22-07-2026 12:00 AM

ఉప్పల్, జూలై 21 (విజయక్రాం తి) : మల్లాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ 17 ఏళ్ల యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటుచేసుకుంది. సబ్ ఇన్స్పెక్టర్ ప్రభాకర్ రెడ్డి   తెలిపిన వివరాల ప్రకారం, నాగలక్ష్మి నగర్ కాలనీలో నివాసముంటున్న పసుపుల శేఖర్ కుమారుడు పసుపుల నాని (17) ఆదివారం స్నేహితులతో కలిసి బ్యాండ్ కార్యక్రమానికి వెళ్లి, తిరిగి ఇంటికి వచ్చి మళ్లీ బయటకు వెళ్లినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

మంగళవారం తెల్లవారుజామున కుటుంబ సభ్యులకు నాని ఇంటి పక్కనున్న పార్కింగ్ ప్రాంతంలో ఉరి వేసుకుని వేలాడుతున్నట్లు సమాచారం అందింది. వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న కుటుంబ సభ్యులు పోలీసులకు సమా చారం అందించారు. పోలీసులు 108 అం బులెన్స్ సిబ్బందిని పిలిపించగా, వారు పరిశీలించి అప్పటికే యువకుడు మృతి చెంది నట్లు నిర్ధారించారు. ప్రాథమిక విచారణలో నాని మద్యం మత్తులో ఉండి ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారని పోలీసులు తెలిపారు. మృతుడి తండ్రి పసుపుల శేఖర్ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేపట్టారు. ఈ కేసును దర్యాప్తు అధికారి ప్రభాకర్ రెడ్డి పర్యవేక్షిస్తున్నారు.