కార్మికుల ఐక్యతతోనే సమస్యల పరిష్కారం
ఐఎన్టీయూసీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ఎంపీ డా.జి.సంజీవ రెడ్డి
ముషీరాబాద్, జూలై 21 (విజయక్రాంతి): బాగ్లింగంపల్లిలోని విఎస్టీ ఫంక్షన్ హాల్లో తెలంగాణ రాష్ట్ర ఐకెపి వీఓఏ అసోసియేషన్(ఐఎన్టీయూసీ) ప్రథమ మహాసభలు ఘనంగా ప్రారంభమయ్యాయి. గౌరవ సలహాదారు వై.నాగన్న గౌడ్ అధ్యక్షతన జరిగిన సభకు ఐఎన్టీయూసీ జాతీయ అధ్యక్షుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు డా.జి.సంజీవ రెడ్డి, రాష్ట్ర కనీస వేతనాల మండలి చైర్మన్ బి.జనక్ ప్రసాద్, ఐఎన్టీయూసీ రాష్ట్ర ముఖ్య ఉపాధ్యక్షుడు, అసోసియేషన్ అధ్యక్షుడు మొగుళ్ల రాజిరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.డి.చంద్రశేఖర్ హాజరయ్యారు.
డా.సంజీవ రెడ్డి మాట్లాడుతూ కార్మిక వర్గం ఐక్యంగా పోరాడితేనే సమస్యలు పరిష్కారమవుతాయని, ఐకెపి వీఓఏలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి నెలకు రూ.26 వేల కనీస వేతనం కల్పించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని తెలిపారు. మొగుళ్ల రాజిరెడ్డి మాట్లాడుతూ మంత్రి సీతక్క, రాజ్యసభ సభ్యుడు వెం నరేందర్ రెడ్డి సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారని, సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కార్మిక హక్కుల పరిరక్షణకు కట్టుబడి ఉందన్నారు.
బి.జనక్ ప్రసాద్ వీఓఏల డిమాండ్లు న్యాయమైనవేనని పేర్కొన్నారు. వై.నాగన్న గౌడ్ కనీస వేతనం, ప్రభుత్వ ఉద్యోగ హోదా, సీసీ పదోన్నతులు, రూ.10 లక్షల బీమా, ట్యాబ్ల సౌకర్యం కల్పించాలని కోరగా, ఆర్.డి.చంద్రశేఖర్ సమస్యలు పరిష్కారమయ్యే వరకు ఐఎన్టీయూసీ అండగా ఉంటుందని చెప్పారు. సభలో బి.విజయ్ కుమార్ యాదవ్, వి.భాస్కర్ రెడ్డి, కొండా పద్మ, వి.ప్రభాకర్, పి.అరుణ రెడ్డి, శరత్ కుమార్, కవిత తదితరులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 3 వేల మంది ఐకెపి వీఓఏ ప్రతినిధులు పాల్గొన్నారు.






