calender_icon.png 2 November, 2025 | 11:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యూత్ కాంగ్రెస్ నాయకులు సైనికుడిలా పనిచేసి పార్టీ గెలుపు కోసం కృషి చేయాలి

02-11-2025 05:52:39 PM

లక్కేపూర్ లో గ్రామ కమిటీ ఎన్నికల్లో యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు సాదుల శ్రీకాంత్..

మంథని (విజయక్రాంతి): యూత్ కాంగ్రెస్ నాయకులు సైనికుడిలా పనిచేసి పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని మండలంలోని లక్కేపూర్ గ్రామంలో యూత్ కమిటీ ఎన్నికల్లో యూత్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సాదుల శ్రీకాంత్ అన్నారు.‌ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు జక్కిడి శివ చరణ్ రెడ్డి, మంథని నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు చీమల సందీప్ సూచన మేరకు మంథని మండలం లక్కేపూర్ గ్రామంలో ఆదివారం మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సాధుల శ్రీకాంత్ ఆధ్వర్యంలో యూత్ కాంగ్రెస్ నూతన గ్రామ కమిటీని ఎన్నుకున్నారు.

గ్రామ అధ్యక్షులుగా పండుగ సన్నీ, ఉపాధ్యక్షులు, ఎండీ ఫహీమ్, ప్రధాన కార్యదర్శి మారుగోని సాయి, కార్యదర్శిగా బడికెలా రాహుల్, కోశాధికారి ఎండీ ఇమ్రాన్, అధికార ప్రతినిధిగా నాంపెల్లి అజయ్, ప్రచార కమిటీ కన్వినర్ గా మంథని సందీప్, కార్యవర్గ సభ్యులుగా అరెల్లి శ్రీధర్, మెరుగు హరీష్, దూడపాక రవి, బూడిద సాయి, దాపరి లోకేష్, దూడపాక శ్రీకాంత్, బూడిద సుమంత్, బడికెలా అరుణ్, ఆకాష్, దూడపాక అరుణ్,ఎన్నుకున్నారు. ఈ సందర్బంగా యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు శ్రీకాంత్ మాట్లాడుతూ పార్టీని భలోపేతం చేయడానికి ఉత్సహంగా పనిచెయ్యాలని యూత్ కాంగ్రెస్ నాయకులకు సూచించారు. రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో సైనికుడిలా పనిచేసి పార్టీ గెలుపు కోసం కృషి చెయ్యాలన్నారు.

అనంతరం నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలియచేశారు. ఇప్పటివరకు దాదాపు  అక్కేపెల్లి, పుట్టపాక, దుబ్బాపల్లి, బెస్తపల్లి, చిల్లపల్లి, సిరిపురం, గద్దలపలి లక్కేపూర్ గ్రామాలలో యూత్ కాంగ్రెస్ కమిటీలను పూర్తి చేయడం జరిగిందని, త్వరలోనే మంథని మండలంలోని అన్ని గ్రామాలలో యూత్ కాంగ్రెస్ కమిటీలను నియమించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్ ఎస్ యూఐ డివిజన్ అధ్యక్షులు కేక్కర్ల సందీప్, గ్రామ శాఖ అధ్యక్షులు ఇసంపల్లి శ్రీనివాస్, ఎస్సీసెల్ మంథని మండల అధ్యక్షులు మంథని రాకేష్, సీనియర్ నాయుకులు కూర కోటేష్, ఎస్సీసెల్ గ్రామ శాఖ అధ్యక్షులు అరెళ్ల శ్రీధర్, పిఎసిఎస్ డైక్టర్ కొత్త శ్రీనివాస్, మైనారిటీ మండల్ ఉపాధక్షులు సల్మాన్, యూత్ కాంగ్రెస్ సీనియర్ నాయుకులు మంథని కుమార్, ఎరుకలక ఎల్లయ్య, మాజీ గ్రామ శాఖ అధ్యక్షులు కూర కుమార్ తదితరులు పాల్గొన్నారు.