calender_icon.png 2 November, 2025 | 11:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోలీసుల ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్

02-11-2025 05:59:13 PM

నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంతో పాటు వివిధ ప్రాంతాల్లో జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆదేశాల మేరకు ఆదివారం పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. జిల్లాలోని అన్ని రహదారులపై తనిఖీలు నిర్వహించి మైనర్ లు వాహనాలు నడిపితే చట్టపరమైన చర్యలు తీసుకున్నారు. 45 వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. పెండింగ్ చలాన్ వసూలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆయా పోలీస్ స్టేషన్ ఎస్ఐలు నారిశక్తి మహిళా పోలీసులు పాల్గొన్నారు.