03-03-2025 08:34:48 PM
భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఐపిఎస్...
దుమ్ముగూడెం (విజయక్రాంతి): పోలీసుల ఆధ్వర్యంలో నాలుగు రోజులపాటు ములకపాడు క్రీడా మైదానంలో జరిగిన మండల స్థాయి వాలీబాల్ పోటీలు సోమవారం ముగిశాయి. ఈ ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఐపిఎస్ పాల్గొన్నారు. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ సూచనలు మేరకు దుమ్ముగూడెం పోలీసులు ఏర్పాటుచేసిన ఈ మండల స్థాయి వాలీబాల్ పోటీలలో 68 టీమ్ లు పాల్గొన్నాయి. కొత్తమారేడుబాక, అంజుబాక టీం లు ఫైనల్ కు చేరుకున్నాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పోలీస్ అధికారులు, సిబ్బంది, స్థానిక ప్రజలు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ ఫైనల్ మ్యాచ్ ను ఆసక్తితో తిలకించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న జిల్లా ఏఎస్పీ మాట్లాడుతూ... ఏజెన్సీ ప్రాంతాల్లోని యువత చదువుతో పాటు క్రీడల్లోను రాణిస్తూ ప్రాంతానికి మంచిపేరు తీసుకురావాలని సూచించారు. దుమ్ముగూడెం మండలం నుండి యువత క్రీడల్లో జాతీయస్థాయి వరకు చేరుకొని ఈ ప్రాంతానికి, జిల్లాకి, రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని ఆశించారు. మారుమూల ఏజెన్సీ ప్రాంతాల్లో నివసించే ఆదివాసి ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం జిల్లా ఎస్పీ సారథ్యంలో పోలీస్ శాఖ తప్పున ఎన్నో కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఏజెన్సీ ప్రాంతాల్లోని ప్రజలకు మరింత చేరువయ్యేలా భవిష్యత్తులో కూడా వివిధ రకాల కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు.
ఏజెన్సీ ప్రాంతాల్లో నివసించే యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం పోలీసు శాఖ తరపున వారికి ప్రత్యేకంగా శిక్షణ ఇప్పంచడంతో పాటు, నిత్యం వారికి అందుబాటులో ఉంటూ వారికి కావలసిన సౌకర్యాలను అందించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో దుమ్ముగూడెం సిఐ రమేష్, ఇన్స్పెక్టర్స్ అశోక్, ఎస్సైలు వెంకటప్పయ్య, కేశవ, తదితరులు పాల్గొన్నారు. మండల స్థాయి వాలీబాల్ పోటీల్లో మొదటి బహుమతి గెలుచుకున్న కొత్త మారేడుబాక, రెండవ బహుమతి గెలుచుకున్న అంజుబాక టీం లు ఏఎస్పీ చేతుల మీదుగా బహుమతులను అందుకున్నారు.