31-07-2025 10:23:55 PM
పట్టించుకోని విద్యుత్ శాఖ అధికారులు
మేడ్చల్ అర్బన్: ఎల్లంపేట పురపాలిక పరిధిలోని సోమారం గ్రామ పంట పొలంలో విద్యుత్ స్తంభం విరిగి పడిపోయిన అధికారులు పట్టించుకోవడం లేదు. సర్వే నంబర్ 130లోని పంట చేనులో ఇటీవల ఈదురు గాలులతో కురిసిన వర్షాలకు విద్యుత్ స్తంభాలు కింద పడిపోయాయి. కాగా వాటి స్థానంలో నూతన విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయాలని ఏఈ,కింది స్థాయి విద్యుత్ అధికారులకు కోరినప్పటికీ పట్టించుకోవడంలేదని రైతులు నారాయణ యాదవ్,లోకేష్ యాదవ్,నర్సింహలు గురువారం మీడియాతో ఆవేదన వ్యక్తం చేశారు. గత ఐదు రోజుల నుండి పంట చేనుల్లో విద్యుత్ స్తంభాలు ఉన్నాయని, విద్యుత్ అధికారులు మరమ్మత్తులు చేపట్టకపోతే తా ము ఎలా వ్యవసాయం చేసుకోవాలని ప్రశ్నిస్తున్నారు. విద్యుత్ సౌకర్యం లేకపోవడంతో దుక్కి దున్నిన తమ పంట పొలాలు నీరు లేక ఎండి పోతున్నాయన్నారు.విద్యుత్ సౌకర్యం కల్పించకపోతే తాము వరి పంటను ఎలా వేసుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికైనా విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు వెంటనే స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని రైతులు కోరారు.