calender_icon.png 1 August, 2025 | 6:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మణుగూరు కోర్టు సమస్యలపై బార్ కౌన్సిల్ చైర్మన్‌కు వినతి

31-07-2025 10:04:52 PM

మణుగూరు,(విజయక్రాంతి): స్థానిక ప్రథమ శ్రేణి జ్యుడీషియల్ కోర్టులో అదనపు కోర్టు ఏర్పాటు చేయాలని, బార్ అసోసియేషన్ ప్రతినిధులు గురువారం రాష్ట్ర బార్ కౌన్సిల్ చైర్మన్ నరసింహారెడ్డి, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యులు విష్ణువర్ధన్ రెడ్డి, రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు గోకుల రామారావులను కలసి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా  అసోసియేషన్ అధ్యక్షులు బద్దం శ్రీనివాస్ రెడ్డి విలేకరులతో మాట్లాడారు.

న్యాయస్థానం పరిధిలో పెరుగుతున్న కేసుల నిబద్ధతను దృష్టిలో ఉంచుకొని అదనపు కోర్టు ఏర్పాటు అవసరం ఉందని బార్ కౌన్సిల్ చైర్మన్ దృష్టికి తీసుకు వెళ్లామని తెలిపారు. తమ విజ్ఞప్తిపై  చైర్మన్ సానుకూలంగా స్పందించారని, త్వరలోనే హైకోర్టు దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిపారన్నారు. జూనియర్ న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని  హామీనీ ఇచ్చారని పేర్కొన్నారు.